Tuesday, November 1, 2011

వెన్నెల కాటేసింది

మొన్ననే ఒక మంచి పుస్తకం చదివాను.
దానికోసం ఏదో రాయాలనిపించి రాస్తున్నాను.
సాధారణంగా ఏదైనా పుస్తకం చదివితే అందులో నచ్చిన విషయాలతో నోట్స్ టైప్ చేసి పెట్టుకోవటం అలవాటు.
అలాంటి ఒక నోట్ కి నా ముందు మాట..





























link : http://www.koumudi.net/books/koumudi_vennela_katesindi.pdf


గొప్పవాళ్ళ ప్రతిభను గుర్తించటానికి మనం గోప్పోళ్ళం కావాల్సిన అవసరం లేదు.

దురదృష్టం ఏమిటంటే ఎవరైనా గొప్పోళ్ళు గుర్తించినప్పుడు మాత్రమే గొప్పవాళ్ళగొప్పదనం కోసం మనం గొప్పగా చెప్పుకుంటాం.







Tuesday, July 26, 2011

కాగితం పడవలు

చాలా రోజుల క్రితం ( అంటే ఓ మూడు,నాలుగేళ్ల క్రితం )  నేనొక వీక్లీ లో చదివిన కథ.
ఎందుకో తెలీదు కానీ , శైలబాల గారి బ్లాగులో ఓ కామెంట్ చూసిన తర్వాత పదే పదే గుర్తొస్తుంది.
కథ ఇలానే ఉంటుంది , అంటే ఇవే పదాలు ఉంటాయని కాదు . కానీ నాకు గుర్తున్నంతవరకూ ఇలానే ఉంటుంది 
క్లుప్తంగా ఆ కథలో .. 
పేరుకునోచుకోని రచయిత ( అంటే వాళ్ళమ్మా నాన్నా ఏ పేరూ పెట్టలేదు అని కాదు, ఆయనకి మారుపేర్లు ఎవరూ పెట్టలేదని అసలే కాదు)ఒకాయన ఉంటాడు. అతని రచనలని ఎవ్వరూ పట్టించుకోకపోవటం, సరిగ్గా  ప్రోత్సహించక పోవటం, మెచ్చుకోలుగా కాకపోయినా,కనీసం  ముక్తసరిగా అయినా ఎవరూ "బావుందయ్యా, బాగారాసావ్ ! " అనేవాళ్ళు లేకపోవటం తో మనసు బాద పడినా అతని రచనని  అంతటితో ఆపేసి , రాసిన కధల కాగితాల్ని అటకెక్కించేస్తాడు .మొదట్లో దానికి ఆయన బాద పడ్డా, తర్వాత తర్వాత అలవాటు పడతాడు.

ఒకానొకరోజున బయట వర్షం పదుతూండగా, అతని  కూతురు " నాన్నా కాగితం పడవలు చేసిపెట్టవా ! " అని ముద్దుగా అడగటంలోకి , ఇల్లంతా వెతికి వెతికి ఏ కాగితమూ కనపడక పోవటం తో అటకమీద ఉన్న కథలకాగితాల్ని చించి,  పడవలు చేసి , కూతురు కళ్ళలో సంతోషాన్ని చూసి , తను రాసిన  
కథ ఇలా పనికొచ్చినందుకు గానూ ఆనందిస్తాడు .
కాలేజీ ఈడురాగానే అతని కూతురు కూడా చాలా చక్కగా కథలు రాయటం మొదలెడుతుంది. ఆయన అభిరుచే తన కూతురికి వచ్చినదానికంటే , తనకంటే ఎన్నో రెట్లు గొప్పగా , మనసుకి హత్తుకునేలా ఆమె రాస్తూ ఉండటంతో ఆయన సంతోషానికి అవధులుండవు.  అతను పని చేసే ఆఫీసులోనూ , అతని స్నేహితులదగ్గరా ఆమె రాసిన కథల్ని వినిపించి , వారు రాసిచ్చిన స్పందనల్ని , సలహాల్ని సూచనల్ని తనకూతురికి ఇస్తూ ఉంటాడు. 
ఆ ఉత్తరాల్ని చూసి అబ్బురపడుతున్న కూతుర్నిచూసి మురిసిపోతూ ఉంటాడు.



"గువ్వా గోరింక .. రెండింటి  జాతులు వేరు,
అయినా జంట అంటే గువ్వా గోరింకనే చెప్తూ ఉంటాం.. అంతప్రేమగా కలిసిమెలిసి ఉండాలని అంటూంటాం..
కానీ మనుషుల్లోకొద్దుల్లోకి కులాలు వేరైతేనో , మతాలు వేరైతోనో , అంతస్తులు వేరైతేనో.
ఎందుకు ఇద్దరిమద్యన ప్రేమని అంగీకరించి, పెళ్ళిచేసి కలకాలం కలిసుండమని దీవించలేకపోతున్నాం  ?.. " అంటూ అతిసున్నితమైన ప్రేమకథనొకదానిని కుటుంబ బంధాలకు ముడివేస్తూ ఓ కొత్త కథనొకదానిని అతని కూతురు రాస్తుంది.


కథ :
"నాకు నువ్వంటే చాలా ఇష్టం, ఇప్పుడేకాదు  ఎప్పటికీ ఇదే మాట చెప్తాను.
ఒకవేళ మన ప్రేమను మా అమ్మానాన్నలు ఒప్పుకోకపోతే , వాళ్ళను వదిలి నీతో వచ్చేస్తా ..! 
మీ అమ్మానాన్నా ఒప్పుకోక పోతే, నువ్వు నాతో వచ్చేయ్ .. !అని మాత్రం అనను. 
ఎందుకంటే  వాళ్ళు మనమీద పెట్టుకున్న ఆశల్ని, నమ్మకాల్ని ఒమ్ము చెయ్యకూడదు అని నువ్వే అంటావ్ గా ..
మన రెండుకుటుంబాల అంగీకారం ఉంటేనే మన పెళ్లి జరుగుతుంది.
ఈ రోజు నిన్ను మా నాన్నకి పరిచయం చేస్తా , ఆయన ఒప్పుకుంటే మీ ఇంట్లో మాట్లాడదాం , లేకుంటే ....... .... నన్ను క్షమించు , కనీసం క్షమించటానికి  ట్రై చెయ్ .. ..ఇక అంతే శివా ! అని చెప్పి శివతో కలిసి ఇంటికొచ్చింది ప్రియ.

ప్రియా వాళ్ళ అమ్మ ముగ్గురికీ కాఫీ తెచ్చి, తనూ వాళ్ళతో పాటే కూర్చుంది.
నేను చెప్పాగా శివ, చాలా మంచి అబ్బాయ్ అని ఇతనే అమ్మా , శివని పరిచయం చేస్తూ అంది.
నమస్తే ఆంటీ ! ఎలా ఉన్నారు ? మర్యాదపూర్వకం గా అడిగాడు శివ. 
బావున్నానయ్యా, మీ అమ్మా నాన్నా అంతా బాగున్నారా ? క్షేమసమాచారాన్ని అడిగి  తెల్సుకుంది ఆవిడ.
మాటల మధ్యలోనే ప్రియా వాళ్ళ నాన్నకూడా వచ్చారు, పరిచయాలయ్యాకా ప్రియ వాళ్ళ నాన్న దగ్గరగా నిలబడి చెప్పటం మొదలెట్టింది .
నాన్నా, శివ గురించి మీకు అన్నీ చెప్పాను బాగా చదువుకున్నాడు. మంచి ఉద్యోగం.
ఈ రోజు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను .. "శివ నన్ను ప్రేమిస్తున్నాడు. నేను శివను ప్రేమించేదానికి ఎన్నో రెట్లు .. నన్ను ప్రేమిస్తున్నాడు.
మీరెప్పుడూ అంటూ ఉంటారుగా.. నిన్ను మహరాణిలా చూస్కునే ఇంటికి నిన్ను కోడలిగా పంపుతా అని.. 
శివ నన్ను నాలా చూస్కుంటాడు, అచ్చం మీలా నాకు అండగా ఉంటాడు . నేను మీతో ఉన్నప్పుడు ఎంత నిశ్చింతగా , ధైర్యం గా ఉంటానో  శివతో  
ఉన్నప్పుడు కూడా అలానే ఫీల్ అవుతా ..ప్లీజ్ నాన్నా నేను అతన్ని  పెళ్లి చేస్కోవటానికి ఒప్పుకోండి నాన్నా" వేడుకోలుగా అడిగింది ప్రియ ..
ప్రియ అతన్ని ప్రేమించాను అన్న మాట దగ్గర్నుంచి తనలో తానులేని ప్రియతండ్రి ,
ఒప్పుకోండి నాన్నా .. ప్లీజ్ ఒప్పుకోండి .. అంటూ తనచేతిని తాకిన కూతురి  చేతి స్పర్శలో ఏ తేడాను గమనించలేకపోయాడుగాని ,
తండ్రిలో మెదులుతున్న  భయాన్ని , దిగులుని , కోపాన్ని ,ప్రేమని ,సన్నటి ఒణుకుని ప్రియగమనించింది.
అయిదు నిమిషాలు అని ,అస్పష్టం గానే అని  అక్కడనుంచి బయటకు వెళ్ళిన ప్రియతండ్రి
అతనిలో మెదులుతున్న ఆలోచనల అస్పష్టతకు నిదర్శనంగా ..ఒక పద్దతిలేకుండా ఆరుబయట అటూ ఇటూ కలదిరిగి , తిరిగొచ్చి సమాధానం చెప్పటానికి వాళ్ళముందు కూర్చున్నాడు.
నాన్న ఏమి చెప్తారో అన్నట్లు గా చున్నీని మెలికలు తిప్పుతున్న ప్రియ మొహం లో ఆందోళనని గమనించిన శివ,
"మీరు ఇప్పుడు చెప్పబోయే విషయం రెండు ఊళ్లకో , రెండు కుటుంబాలకో సంబంధించింది కాదు ,
రెండు మనసులకి , ముఖ్యంగా మీ అమ్మాయి జీవితానికి సంభందించింది.
మీ అమ్మాయిని నేనెలా చూస్కుంటానో  అన్నదిగులు మీకొద్దు , మీ అమ్మాయి సంతోషానికి నాది హామీ " అని , తనవైపే చూస్తున్న ప్రియతండ్రితో అన్నాడు శివ .
శివమాటలకి మనసు మారినా మారకపోయినా , సూటిగా మాత్రం అతన్ని చూడలేనన్నట్టు చుట్టూ పరిసరాల మీదికి చూపు మరల్చిన  ప్రియతండ్రి
తన నిర్ణయం లో ఎలాంటి మార్పు లేదన్నట్టు నిటారుగా నిలబడి చెప్పసాగాడు,
నా జీవితం లో ఏదయితే జరగకూడదనుకున్నానో  అది ఈ రోజు జరిగింది. నా కూతురు అడిగిందల్లా ఇచ్చానన్న సంతృప్తితోనే కాలం గడిపేద్దాం అనుకునే
వాడిని , నాకాభాగ్యం కూడాలేదని ఈరోజు తేలిపోయింది.
(అతనేమి చెప్పాలనుకుంటున్నాడో అర్ధమైనట్లు వారి మద్యలో కఠిక నిశ్శబ్దం ఆవరించుకుంది. )
ఈరోజు తర్వాత నన్ను నేను క్షమిచుకోగలనా అనేకంటే,నాకూతురికి నా మొహం ఎలా చూపించాలి అనేదే నన్నెక్కువ తొలిచేస్తుంది.
ఏది ఏమైనా చెప్పాలనుకున్నది _______
నాకు నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చెయ్యటం ఇష్టం లేదు బాబు.
ఎందుకిష్టం లేదు ? అడిగాడు శివ .
నీకు తెలియనిదేం కాదుగా ?బదులిచ్చాడు ప్రియతండ్రి   
మీకులం అబ్బాయే అయితే చేసేవారా ?
లక్షణం గా చేసేవాడిని ..
అంటే మీకు మనుషులు , మనషులు , మీ కూతురి సంతోషం అన్నింటికంటే కులమే కావాలా ?
నా కూతురి సంతోషంతో పాటూ, నా కుటుంబ గౌరవమర్యాదలు కూడా కావాలి.
మీకులం అబ్బాయితో మీ అమ్మాయి సంతోషం గా ఉంటుందని మీరు చెప్పగలరా  ?
ఉండదని నువ్వు చెప్పగలవా?
ముమ్మాటికీ చెప్పగలను .. నన్ను ప్రేమించి వేరొకరితో ఖచ్చితంగా సంతోషంగా ఉండలేదు.
ఆర్ద్రం గా మారిన గొంతుతో వాదిస్తున్నట్లు, కళ్ళతో  బతిమాలుతున్నాడు శివ .  
అతని ప్రేమలో నిజాయితీముందు ,తనపెద్దరికం ఓడిపోతుందని గ్రహించాడు ప్రియతండ్రి .
ఏది ఏమైనా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు.నా నిర్ణయం మారదు. ఈ విషయంపై కలవటాలు, మాట్లాడటాలు అనవసరం ... మరోసారి బిగ్గరగా అరిచాడు . 
అతని నిర్ణయాన్ని ఏ మాత్రం ఒప్పుకోమని, అతని ఆవేశాన్ని చల్లార్చటానికి బద్దలైన మంచుపర్వతాలు కరిగి ప్రవహించేలోగా, తడబడుతున్న పెద్దరికపు అడుగులతో అక్కడనుంచి తప్పుకున్నాడు.
వెక్కి వెక్కి ఏడుస్తున్న కూతుర్ని , అలానే సోఫాలో కూలబడ్డ అతడిని చూస్తూ ఎటూ మాట్లాడలేని బేలతనం తో ప్రియతల్లి స్థానువై నిలిచుండి పోయింది.
వాళ్ళిద్దరినీ కదిలించే ధైర్యం నాకు లేదు.  ఏమైతేనేం వాల్లప్రేమ కథ ఇంతటితో సమాప్తం"
ఈ కథ ముగింపు నాకు నచ్చలేదమ్మా ! 
కథ మొత్తం చదివాకా కూతురు తో అంటాడు అతను .
ఎందుకునాన్నా ? 
వాళ్ళ అమ్మ ఇచ్చిన కాఫీ తీసుకుంటూ తండ్రికి ఎందుకు నచ్చలేదో తెల్సుకుందామని అడుగుతుంది ఆమె.
అంతగా ప్రేమించుకున్న వాళ్ళిద్దరినీ  విడదీయటం , అదీ పెద్దరికం అని ఏదో ఓ సాకు చెప్పటం , కేవలం కులాలు ఒకటి కావుఅని
ఆపెద్దాయన పిల్లల ప్రేమని అంగీకరించక పోవటమే నాకు నచ్చలేదు.
ఏదో గజిబిజిగా ఉంది రాసాను నాన్నా , తర్వాత మళ్ళీ ఒకసారి నేను చూసి చెప్తాలే - అని కూతురు అభయం ఇవ్వటం తో  అతడు కొంచెం శాంతిస్తాడు.
సాయంత్రం పూట కాఫీ తాగుతూ పేపర్ ని తిరగేస్తున్న అతని పక్కగా వచ్చి కూర్చుంటుంది అతనికూతురు .
ఆ కథని ఏం చేశావమ్మా ? అని అడుగుతుండగానే కాలిగ్ బెల్ మోగుతుంది.
ఆమెవెళ్లి తలుపుతీసి లోపలి ఆహ్వానిస్తుంది.
మీరెవరండి ? - వచ్చిన వ్యక్తిని అడిగుతాడు
వచ్చింది ఎవరో ఊహించగల్గిన అతని భార్య నవ్వుతూ కాఫీ తీసుకురావటానికి వంటగదిలోకి వెళ్తుంది .  
"నా పేరు శివ . మీ అమ్మాయి నాగురించి చెప్పే ఉంటుంది . నేనూ మీ అమ్మాయి ప్రేమించుకుంటున్నాం . మీరు ఒప్పుకుంటే పెళ్లి చేస్కోవాలని ఆశపడుతున్నాం . 
మా అమ్మా నాన్నలకి ఏ అభ్యంతరమూ లేదు. ఇక నిర్ణయం తీస్కోవల్సింది మీరే. " అని అతను అంటూండగా  
తన తండ్రి మొహం లో హావ భావాల్ని చూసి లోలోపల నవ్వుకుంటూ ఉంటుందామె.
కూతురిచ్చిన ఈ ట్విస్ట్ కి , ఏదోలా తేరుకుని అయిదు నిమిషాలు అని అప్రయత్నం గానే అని , బయటకెళ్ళి అటూ ఇటూ నాలుగు పచార్లు చేసి లోపలికొచ్చి ఓ గ్లాసు మంచినీళ్ళు తాగి , నాకు కొంచెం టైం కావాలి అని చెప్తాడు.
"ఎలాగూ ఊ.. అనే అనాలిగా , దానికోసం ఇంత చెయ్యాలా ? పైగా నాలుగురోజుల టైం కూడాను " అన్నట్టు ఓ చూపు చూసి , అతనిచేతిలో వేడివేడి కాఫీ పెడుతుంది అతని భార్య..
ఆకాశంలో మబ్బులు పట్టేసి , మిరపకాయబడ్డీలోల్లకి మంచిగిరాకీ ఉన్న టైం లో కూతురురాసిన కథల కాగితాల్ని  ముందెట్టుకుని
కూతుర్ని దగ్గరికి పిలిచి "శివని  నువ్వు పెళ్లి చేస్కోవటం నాకు ఇష్టమే అమ్మా !"అని ఆ శుభవార్త ఆమె చెవునవేస్తాడు.
ఆమె సిగ్గుల మొగ్గయ్యి ఆ వార్తని అమ్మకి చెప్పటానికి వంటగదిలోకి వెళ్తుంది .
కూతురు రాసిన కథను వాళ్ళదగ్గరికి  తీసుకెళ్ళి,
ఎలాగైనా వాళ్ళిద్దరినీ కలుపు తల్లీ ! లేకపోతే నాలోని సగటు మాజీ.తెలుగు రైటర్ సహించేలా లేడు. అంటాడు .
అతని చేతిలో కాగితాన్ని పడవగా మలుస్తూ ,

"నిజ జీవితంలోనే కాదు , నా కథలలో కూడా శివ నావాడు. వేరొకరికి చెందటాన్ని నేను సహించను అని చెప్తుంది "



_______________________________________________
నా మనసుకు హత్తుకుపోయిన కొన్నికథల్లో ఇది ఒకటి.
రచయిత ఎవరో తెలీదు కానీ, నా స్పెషల్ థాంక్స్  . .    

* It may be the subject of copy right. If there is any objection i will remove it from my blog ..




THANK YOU..

Thursday, April 28, 2011

జుం జుం మాయ .. ఇది హల్వా మాయ..

అనగనగా

అది నేను నిక్కర్లేసుకుని తిరిగేటప్పటి ఓ రోజు సాయంత్రం..
నేను పెసాదం గాడు మా బళ్ళో ఆఖరిగెంట కొట్టకుండానే ,మా బోర్డేస్కూలు హెడ్డు మేస్టారి కళ్ళు కప్పి , బడిగోడదూకి, పారిపోయి పెందలాడే కొంపకి వచ్చెయ్యటం మూలంగా సాయంకాలమేల ఓ అరగెంట పెరిగినట్టు ఉంది.

తాతయ్యకి కనిపిస్తే ఏరా ఇయ్యాల పెందలాడే బడి ఇడిచిపెట్టేసేరా, గొమ్మున ఇంటికొచ్చేసేవు ? అని ఎక్కడ అడుగుతాడో అన్న బెయంతో మెల్లగా సడీ సప్పుడు సెయ్యకుండా నక్కి నక్కి ఇంట్లోకి దూరి పుస్తకాల సంచిని తలుపు గడియకి తగిలించేసి, మెల్లగా పెసాదం గాడి ఇంటికి బయలుదేరేను.


మా ఇల్లు దాటేనో లేదో " ఒరే కేశవా , నువ్వప్పుడే బడి నుంచి ఒచ్చేసావ్ , మా పిల్ల ఇంకా రాలేదేంట్రా ? " అని లచ్చక్క కేకేసింది."మేష్టారు అడిగిన పెశ్నలకి సరిగ్గా సమాదానం సెప్పినోల్లని ఒక్కొక్కలుగా పంపేత్తున్నారు, సెప్పనోల్లని అక్కడే ఉంచి సదివిత్తున్నారు ,
మీ అమ్మాయి ఎప్పుడు సదవాలి , ఎప్పుడు సమాదానం సెప్పాలి ? అందరూ వచ్చేకా ఆఖరున ఎప్పుడో గెంట కొట్టేకా వత్తాదిలే అక్కా, నువ్వేమీ కంగారుపడమాకు" అని ధైర్యం సెప్పి మెల్లగా అక్కడ నుంచి జారుకుని పెసాదం గాడి ఇంటిదగ్గరికి సేరుకున్నాను.


ఆడిల్లు ఇంకో నాలుగు బారలు దూరం ఉందనగానే మా వోడు ఏదో రాగం తీత్తా నా దగ్గరకి వచ్చేడు. ఆ రాగం లోనే కలిపేత్తా మా నాన్న బడిలోంచి పారిపోయి వచ్చినందుకు నన్ను ఏకేసి, కుమ్మేసి,దంచేసేడురా అని సెప్తా కూసింత సవుండు పెంచేడు.


ఏడవకరా పెసాదం ..మనం ఇంకా సిన్నపిల్లలం , అందుకే మేష్టారు కళ్ళు కప్పినా , ఇంట్లో వాళ్ళ కళ్ళు కప్పలేక పోతున్నాం. మొన్న ఇద్దరం తన్నులు తిన్నాం , ఇప్పుడు నువ్వొక్కడివే తిన్నావ్ .. రేపొద్దున్న ? ఏంటి ?
అసలు ఏంటి రేపొద్దున్న ? అని రెట్టించి, ఊరించి అడుగుదుల్లోకి , ఉతసాహం గా పెసాదం గాడు "ఎవ్వరం తన్నులు తినం " అని ఆశాభావం ఎకతం చేసేడు.బగుషత్తును సూస్కుని ఇయ్యాలమనం పడ్డ నొప్పుల్ని మర్సిపోవాల్రోయ్ పెసాదం అని ఆడికి , నేను అప్పటికే సూసిన అదేదో సినిమా డవిలాగుతో కూసింత ఇతబోద సేద్దుల్లోకి ఆడు ఆడి కన్నీల్లను అట్టాగే మింగేసేడు.


"ఒరే, అసలు మనిద్దరం ఎందుకు బడి గోడ దూకేము ? ఎందుకు నువ్వొక్కడివీ తన్నులు తిన్నావు ? " అని నేను అడిగితే అన్నీ తెలిసీ కూడా మళ్ళీ ఏం తెలియనట్టు ఆ పెశ్న ఏంట్రా ? అన్నట్టు మొహం పెట్టేడు .
"చెప్పరా చెప్పు , దేనికోసం ? అని మళ్ళీ అడుగుదుల్లోకి మెల్లగా సమాధానం సేప్పేడు " అలవా" అని .


అదిమరి! , నువిల్లా ఏడుత్తా కూర్చుంటే , ఇయ్యాలున్న లచ్చివారం అయిపోద్ది, మన ఊరి సంతలో మిర్చిరి బండోడి దగ్గిర అల్వా కూడా అయిపోద్ది "అని నేను అన్నాను . గొమ్మున ఎల్దాం నడువు అని నన్ను కంగారు పెడతా పెసాదంగాడు సూపరు బండిలా దూసుకెళ్ళి, మా గంగరాజు ఆళ్ళ ఇంటికాడ సడన్ బ్రేకు ఏసేడు. తీరా ఎందుకు ఆగేడా అని సూత్తుంటే మా ఈరబాబు, గంగరాజు తాడు బొంగరం ఆట ఆడుతున్నారు . "ఏరా మాఇద్దరినీ కేకేయ్యకుండా మీరిద్దరే ఆడేస్కుంటున్నారే ?" పెసాదం గాడు ఈరబాబు గాడిని నిలదీసేడు.

"కేశవా నీ గురించి అడిగితే మీ ఇంట్లో నువ్వింకా బడి నుంచి రాలేదని చెప్పేరు.
పెసాదం గురించి ఎల్తే ఈడి నాన్న అప్పుడే ఈడికి పెళ్లి సేత్తున్నాడు. ఇంకేం కేకేత్తాంలే అని మేమిద్దరమే ఆడుకుంటున్నాం" అని సెప్పాడు మా ఈరబాబు.


మామూలుగా అయితే నేను పెసినడిగితే ఆడికి సమాధానం సెప్తావేంట్రా అని మళ్ళీ కసురుకునేవోడే ,కానీ ఎందుకో గమ్ముగా ఉండిపోయేడు మా పెసాదం .


అయితే మేమిద్దరం కూడా ఆడతాం అన్నాను నేను . గంగరాజు ఇంట్లోకెళ్ళి ఇంకో రెండు బొంగరాలు తెచ్చేడు. అసలే ఆల్లనాన్న సేతిలో తన్నులు తిని, అది ఈరబాబుగాడు సూసినందుకు బాద పడుతున్న పెసాదం , తాడుని గట్టిగా చుట్టి బొంగరాన్ని బలంగా నేలనేసి కొట్టేడు.
అది గతి తప్పి గోడమీద పడి ఎగిరి పక్కనే ఉన్న , తమలపాకులకి రంగులేసే పిడత(చిన్నపాటి మట్టి కుండ ) మీద పడి , పిడత పగిలిపోయింది .


ఎవరూ సెప్పాల్సిన అవసరం లేకుండానే అక్కడనుంచి మేం నలుగురం పరిగెత్తుకుని వచ్చేసేము.
సేలాసేపు ఊరంతా తిరిగి తిరిగి చివరికి సీకటి పడ్డాకా సంతలోకి సేరేము. సంత(బజారు, మార్కెట్టు లాంటిది ) లో జన సాంద్రత దాదాపు సర్దుకుంది . మా అదృష్టం బావుండి హల్వా ఇంకా ఉంది.

రెండ్రోజులుగా ఖర్చు పెట్టకుండా దాచిన తాతయ్య ఇచ్చిన అయిదు రూపాయలు ఇచ్చి , చిల్లర కోసం నిలబడి ఉన్నాను .రూపాయివ్వు.. అని అడిగాను . ఒకొక్కటీ రూపాయన్నర అని , తిరిగి అతను నన్ను రూపాయివ్వు అన్నాడు ..


ఏం చెయ్యాలో తెలీని పరిస్థితి లో నిలబడ్డ నాకు, మా తాతయ్య వరల్డ్ బ్యాంకులా అక్కడే కనిపించాడు .
నన్ను చూసి నా దగ్గరికే వచ్చాడు . తాతయ్యా ఒక్క రూపాయివ్వు .. అని ఒక ఆర్డరు లాంటి రిక్వస్ట్ చేసేను ..
చీకటి పడే వరకూ ఆటలు ఆడకూడదమ్మా అని మా తాతయ్య మాకు చెప్పి ,అతనికి ఆ రూపాయిచ్చి , నా ఫ్రెండ్స్ ని వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి,నన్ను మా పెసాదాన్ని మా ఇంటికి తీసుకెళ్ళాడు ..


మా బాబాయి పెళ్ళికొచ్చి వెళ్లి పోయిన చుట్టుపక్కల ఊర్లో ఉండే చుట్టాలంతా మళ్ళీ మా ఇంటిదగ్గరే ఉన్నారు.
మా ఊళ్ళో తెలిసినోల్లు , మా స్కూలు హెడ్డు మాస్టారు , మా పెసాదం వాళ్ళ అమ్మా నాన్నా, మా నాన్న ఫ్రెండ్స్ అంతా మా ఇంటి దగ్గర గుమిగూడేరు . గొప్ప పని చేసి ఇంటికి తిరిగొచ్చే యోధుల్ని సూసినట్టు , అంతా మమ్మల్ని ఆశ్చర్యం + ఆనందం + అదో రకం భావంతో చూడసాగేరు..



కాసేపటికి అంతా సర్దుకుంది ..
మా ఊళ్ళో వాళ్ళు ఎవరింటికి వెళ్లి పోయేరు . మా చుట్టాలంతా ఇంట్లోనే ఉన్నారు.


అమ్మా చుట్టాలు అంతా వచ్చారు మళ్ళీ ఎవరిదైనా పెళ్ళా ? అని అడిగాను ..దానికి మా అమ్మ చెప్పిన సమాధానం విని నేను అసలు నమ్మలేక పోయాను .


"నేను పెసాదం కలిసి హల్వా తినటానికి వెళ్లి , బొంగరాల ఆట దగ్గర కుండ పగలగొట్టి , పారిపోయి , అలసిపోయి , హల్వాతినే మద్యలో ...


ఇంట్లో పెసాదం లేడు. అని గమనించిన పెసాదం వాళ్ళ నాన్న తను కొట్టటం వల్లనే పెసాదం ఇంట్లోంచి పారిపోయాడు అని భావించి, ఏమైనా నాకు తెలిసి ఉంటుందేమో అని మా ఇంటికొచ్చాడు. నేను ఇంకా బడి నుంచి రాలేదు అని మా తాతగారు చెప్పిన సమాధానానికి నిర్ఘాంత పోయాడు. పుస్తకాల సంచి ఇంట్లోనే ఉంది అని మా అమ్మ చెప్పిన సమాధానానికి కాస్త తేరుకున్నాడు, నేను చెప్పిన కథని జంతికలు చుట్టి మరీ వినిపించి చెప్పిన మా లచ్చక్క స్టోరీకి ఇంకాస్త కోలుకున్నాడు , క్లాసు ఎగ్గొట్టి గోడ మేమిద్దరం కలిసే దూకాం అని మా హెడ్డు మాస్టారు నిర్ధారణ చెయ్యటం తో మామూలు మనిసయ్యాడు.




"తను కొట్టాడన్న కోపానికి మా పెసాదంగాడు , మా తాతగారు కొడతారనే భయం తో నేను ఇద్దరం ఇల్లువదిలి వెళ్ళిపోయాం" అని ఆయన సర్టిఫై చేసేసాడు .

మొదట్లో మా వాళ్ళు కంగారు పడక పోయినా , తర్వాత తర్వాత మా బంధువులందరికీ కాల్ చేసి కంగారు పడటం , వీధి వీధికీ నా మొహం తెల్సినోల్లంతా తిరుగుతూ వెతకటం మొదలెట్టారు.



మేం కనిపించట్లేదు అనే మాట, చిన్నపాటి మార్పుల పరిణామం చెంది మేము పారిపోయామని,
మేము పారిపోయామనే మాట , మేము తప్పిపోయామని
మేము తప్పి పోయామనే మాట, మమ్మల్ని ఎవరో తీసుకు( కిడ్నాప్ ) పోయారని గా మారిపోయాయి.


ఎవరు చూసారో తెలీదు కానీ మేము నలుగురం హల్వా తినటం చూసారట !

ఈ మాటకూడా పరిణామం చెంది "హల్వా తిన్న నలుగురిలో ఇద్దరం మేము అనగా ( కేశవ , పెసాదం )" గా అయ్యింది .


తర్వాత ఈ రెండువాక్యాలూ డిజిటల్ మిక్సింగు చేసుకుని ..



"ఊళ్లోకి పిల్లల కిడ్నాపర్లు చొరబడ్డారని ,
వాళ్ళు హల్వా లో మత్తుమందు కలిపి నలుగురు పిల్లల్ని తీసుకెళ్ళి పోయారని ,
ఆ హల్వా తిన్న నలుగురు లో మేం ఇద్దరం కూడా ఉన్నామని గా రూపాంతరం చెందాయి .

కొంతమంది చెక్ పోస్ట్ దగ్గర వాహనాలని ఆపి తనికీ చేస్తుంటే , మరి కొంత మంది బస్టాండులో వెతకటానికి వెళ్ళారు .అసలు ఈ హల్వా గోల ఏంటో తేలుద్దామని మరికొంత మందితో ఇలా సంతలోకి వచ్చిన మా తాతయ్య నా రూపాయి బాకీని చెల్లించారు .

ఆ తర్వాత కొద్ది రోజుల వరకూ , కొద్ది రోజులేంటి ఇప్పటివరకూ మా పెసాదాన్ని , వాళ్ళ నాన్న నిజం గానే ప్రసాదం లా చూడ్డం మొదలెట్టాడు. ఆ తర్వాత వాడిని ఒక్కసారి కూడా పల్లెత్తు మాట కూడా అనలేదు ..

ఉరుము ఉరిమి మంగళి మీద పడిందనో ఏమో ఒక సామెత ఉంటుంది . నాకు ఖచ్చితం గా గుర్తులేదు
కానీ అలా ,అటుచేసి ఇటు చేసి మా నాన్న , పెసాదం వాళ్ళ నాన్న మా అమ్మలకి హల్వా చెయ్యటం రాకపోవటమే ఇంత అనర్ధానికి మూల కారణం అని తేల్చేసారు . :) :)


ఆరోజు నుంచి మా అమ్మ , ఏదైనా పండగొస్తే చాలు , క్యారెట్ హల్వా , బాదం హల్వా, గుమ్మడి హల్వా .. ఇలా హల్వా లతో నే మా పై హమలా చేస్తుంది.. సంవత్సరాలు గడిచాయి .. .


మా అమ్మ హల్వా హమలా తో ఊరుకోలేదు ,
"మీకు క్లాస్ డుమ్మా కొట్టాలంటే కొట్టుకోండి, సినిమాకెల్తారో క్రికెట్టు గ్రౌండుకెల్తారో మీ ఇష్టం , అంతేకానీ నా వంటల ప్రసక్తి మద్యలో తెచ్చి మీ నాన్న నన్ను మాట అనేలా చేసారో , మీ ఇద్దరికీ తన్నులు పడతాయ్" అని నాకు మా తమ్ముడి గాడికి చిన్నపాటి ( సారీ , ఇది చిన్నపాటిది కాదు కదా ! చాలా పెద్దపాటి ) వార్నింగు తో కూడిన బెదిరింపు ఇచ్చేసింది ..


ఏం చేస్తాం చెప్పండి .. అంతా హల్వా మాయ ..!

Friday, April 8, 2011

మా వేణు బాబు గారికి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు ..

HAPPY BIRTH DAY to YOU


             VENHU BABU  






వేణు అన్నా నీకు హార్ధిక జన్మదిన       శుభాకాంక్షలు .. 



- స్వామి( కేశవ)
- Aster .టీం ఇన్ ఫ్రా ( కొల్హాపూర్ )   


Sunday, March 27, 2011

పద్మశ్రీ , మరొక్కసారి నీ ఒడిలో ఒదగాలనుంది..

ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు మా బ్యాచ్ లో నేను చాలా సైలెంట్ టైపు :), నిజంగానే .. అస్సలు క్లాసు లో ఉన్నా లేనట్టే ఉండేవాడిని.. ఎగ్జామ్స్ అప్పుడో , ప్రాక్టికల్స్ అప్పుడో నా వదనాన్ని వీక్షించే అవకాశం లెక్చరర్స్ కి చూపించేవాడిని . నా గురించి ఒకసారి మా ఇంగ్లీష్ మేడం అయితే ఔటర్స్ క్లాస్ లోకి వస్తున్నారని , మా ఫిజిక్స్ మేడం కి కంప్లైంట్ చేసారు.
అంటే నా మొహం అంత గుర్తుండేది మా గురువర్యులకి .



ఏరా ఆ పద్మశ్రీ వదిలేసిందా ఇక్కడికొచ్చి పడ్డావ్ అని , మా ఫిజిక్స్ మేడమే  నన్ను అడిగారు అంటే నాకు పద్మశ్రీ కి మద్య ఉన్న కెమికల్ బాండ్ ఏంటో, ఏపాటిదో మీరు అర్ధం చేసుకోవచ్చు.

,

మనసు బాగున్నా , బాగోకపోయినా ,

ఇష్టమున్నా , లేక పోయినా కాళ్ళు అరిగేలా ఆ పద్మశ్రీ చుట్టూ నే తిరిగేవాడిని.

కాలేజీ, బడులలో కంటే నేను పద్మశ్రీ ఒడిలో గడిపిందే ఎక్కువ, తను అంతలా లాలించేది నన్ను.



ఆ మాటకొస్తే రావులపాలెం లో నాకున్న ఒకే ఒక్క హోప్ "పద్మశ్రీ" ..



పిల్లలు - పెద్దలు ,కుర్రాళ్ళు, ముసలాళ్ళు, పెళ్లైనోల్లు- పెళ్లి కానోళ్ళు అందర్నీ కట్టి పడేసే అందం, సొగసు తనసొంతం.

పద్మశ్రీ అంటే మా కాలేజి బ్యూటీనో , క్యూటీనో కాదు.

రాజమండ్రి కి రంభ ఎలానో ( అప్పట్లో మాట, ఇప్పుడు గీతా అప్సర వచ్చిందనుకోండి) , రావులపాలానికి పద్మశ్రీ అలా అన్నమాట.



పద్మశ్రీ అంటే ప్రపంచాన్ని తనలోనే చూపించే సినిమాతెర,

ఎంతో మందిని తన ఒడిలో కూర్చోపెట్టుకుని, రెండున్నర గంటల సేపు వరకూ లాలించి, మంత్ర ముగ్ధుల్ని చేసే ఓ మాయ.

ఎప్పటికీ నిలిచిపోయే గొప్పదనం తనది , ఏవరేజ్ సినిమానయినా పద్మశ్రీ లో ఎంజాయ్ చెయ్యొచ్చు.

ఈ ధీమాతో నే జనాలు క్యూ కట్టేస్తారు,

"పద్మశ్రీ" ఎంత ఫేమస్ అంటే చుట్టుపక్కల ఊళ్ళ వారు, ఏదైనా పని మీద మా ఊరొస్తే, పద్మశ్రీ లో సినిమా చూడలేదంటే ఏదో వెలితి గా ఫీల్ అయ్యేవారట. టిక్కెట్టు దొరక్కపోయినా, కనీసం పద్మశ్రీ ప్రాంగణం లో సినిమా మొదలయ్యేవరకూ అటూ ఇటూ తచ్చాడి వెళ్తూ ఉంటారు చాలా మట్టుకి,



"శ్రీ వెంకటేశ్వర- పద్మశ్రీ" జంట హాల్లుగా మా తాతల కాలం నుంచి బాగా ఫేమస్.

అప్పట్లో డి.టి.యస్,& ఏ.సీ. కాదు కదా కనీసం కరెంట్ జెనరేటర్ కూడా లేని సినిమా హాళ్ళు..( ఇప్పడు మల్టీ ఫ్లెక్ష్ లు గా మార్చేస్తున్నారనుకోండి) .

యువతలో అయితే "పద్మశ్రీ కి సినిమాకెళ్తే లవర్స్ కధ కంచికి చేరుతుంది" అని గట్టి నమ్మకం.

జంటగా వచ్చిన వాళ్ళు ఏ మూల కూర్చున్నా సరే , ఎవరో ఒకరి కంట, ఎప్పుడో అప్పుడు ఖచ్చితం గా చిక్కేస్తారు.

కొందరు సాహసవీరులు బెట్టింగులుకాసి, బొక్కబోర్లా పడ్డ సందర్భాలు లెక్కకు మిక్కిలి .



పద్మశ్రీ నేను ముందే చెప్పినట్టు చాలా హెల్పింగ్ నేచర్ కలది . అందుకోసమే "పద్మశ్రీ " సహాయాన్నికోరి చాలా మందే వస్తారు

  • స్నేహితులు
( హితులు , స్నేహితులు .. అంటే బాగా ఎంజాయ్ చెయ్యటానికి వెళ్ళే టైపు , పక్కన ఫ్రెండుంటే ఉండే ధైర్యం తో కొంచెం రొమ్ము విరుచుకు తిరుగుతూ వీళ్ళు చేసే అడ్వెంచర్స్ కి కొదవే ఉండదు, క్లాస్ లెప్పుడూ బోర్ అనుకునే నాలాంటోల్లకి ఇక్కడ స్పెషల్ బెంచ్ లు ఉంటాయ్ )

  • ప్రేమికులు
( ప్రేమలో రకరకాల స్టేజిలలో ఉన్నవాళ్ళు అంటే వన్సైడ్ లవర్స్ , టూ సైడ్ లవర్స్, త్రీ సైడ్ లవర్స్ ... ఇలా అన్న మాట .,ఇంకా లవర్ అనే టాగ్ లైన్ , నేమ్ కింద పడకపోతే దానికోసం ఎదురు చూసే వాళ్ళు వీళ్ళలో ప్రముఖం గా చెప్పుకోదగిన వాళ్ళు )
  • ఇంట్లో పెద్దల దగ్గర వాళ్ళ ప్రేమను వ్యక్తపరచలేనోల్లు.
( ఇంట్లో ప్రేమను చెప్పటానికే భయపడేటోల్లు, ఎందుకు ప్రేమిస్తారో నాకైతే అర్ధం కాదు. ప్రేమించిన అమ్మాయి/అబ్బాయి తో బాగానే సినిమా చూసి, ఇంట్లో వాళ్ళ కంట్లోనో ,ఎవడో ఒకడు తెలిసినోడి కంట్లోనో పడి వీల్లకేమీ తెలియనట్లు వెళ్లి పోతారు,వీళ్ళ ప్లాన్ ప్రకారం ఇంట్లో వాళ్లకి లవ్ విషయం తెలుస్తుంది . బయటోడు ఎవడినా చూస్తే అంతకంటే ముందు ఊళ్ళో తెలుస్తుంది. ఫలానా వాళ్ళ అమ్మాయి/ అమ్మాయి , ఫలానా అతను/ఆమె తో తిరుగుతోందట అనే వార్త ఊరంతా పాకి పోవటానికి ఇద్దరూ కలిసి సినిమా చూసినంత సేపు కూడా పట్టదు, అమ్మా నాన్నలకి పెళ్లి ఇష్టం లేకుంటే పరువు బజారున పడటానికి, పెద్దాళ్ళు వీధిలో తలదించుకోవటానికి సినిమా ధియేటర్ లో కలిసి కూల్ డ్రింక్ తాగినంత సేపు కూడా పట్టదు .)

  • ఇంట్లో పెద్దలపై ఒత్తిడి తేవాలనుకునే వాళ్ళు ..
( వీళ్ళు ప్రేమిస్తారు , ప్రేమ విషయం , ఇంట్లో స్వతంత్రం గానో , మరే విధం గానో ఏదో లా ఇంట్లో చెప్పుతారు.
పెద్ద వాళ్ళ నిర్ణయం చెప్పటం లేటయితే గుర్తుచెయ్యటానికి రిమైండరు సినిమాలు చూసేవాళ్ళు , చెప్పాకా ఒప్పుకోకుంటే ఎలాగైనా వాళ్ళపై ఒత్తిడి తెచ్చి, ఇంట్లో వాళ్ళు ఎలా పోయినా పర్లేదు , నా ప్రేమ మాత్రం గెలవాలి అనుకునేటోల్లు వీళ్ళలో ప్రముఖులు . ఇక్కడ ఎవరిది తప్పు , ఎవరిది ఒప్పు అని నేను వివరించే సాహసం చెయ్యను . పరిస్తితులబట్టి చూస్తే , కొన్ని సందర్భాల్లో ఎవరి కోణం లో వాళ్ళే కరెక్టు అనిపిస్తుంటారు )

  • పెళ్ళైన జంటలు , వాళ్ళ బంధువులు , సాధారణ ప్రేక్షకులు ... .
( ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పోస్టేంటి, ఎప్పటికప్పుడూ అప్డేట్ చేస్తూ ఒక బ్లాగే రాయొచ్చు )



కానీ స్పెషల్ కేసు లో ఉండే కొందరు వ్యక్తులుంటారు. వాళ్ళే

  • భార్యా భాదితులు
( ఇంట్లో ప్రశాంతత కొదవయ్యి , నిద్ర కరువయ్యి , పెళ్ళాం పోరు పడలేక కనీసం రెండు, రెండున్నర గంటలన్నా ప్రశాంతం గా పడుకుందామని వచ్చేవాళ్ళు. పాపం అని వీళ్ళని చూసి జాలి పడేటోల్లు, భవిష్యత్తుని తలుచుకుని భయపడేటోల్లు, గతాన్ని తలుచుకుని నవ్వుకునేటోల్లు .. ఇలా చాలామది సానుభూతిపరుల మద్య వీళ్ళు పెసాంతం గా పడుకుంటారు. ).


ఇలా అందరికీ తనకు తోచిన సహాయం చేసే మా పద్మశ్రీ అంటే నాకు ఇష్టం. చాలా చాలా ఇష్టం ..



పద్మశ్రీ ,


నీలో నా పసితనముంది ,

నీలో నా స్వేచ్ఛ ఉంది ,

నీలో బొమ్మలెంత పెద్దగా ఉన్నాయోననుకున్న నా ఆశ్చర్యం ఉంది .,



నీలో నా బాల్యం ఉంది ,

నీలో నా సంతోషం ఉంది ,

నీలో నువ్వు చూపిస్తున్న సీన్ లకి ఏడ్చేసిన నా అమాయకత్వం ఉంది.,



నీలో నా కుర్రతనముంది,

నీలో నా ఆకర్షణ ఉంది ,

నీలో నువ్వు చూపిస్తున్న సీన్లకి ఈలలేసే నా అల్లరితనం ఉంది



నీలో నా యవ్వనముంది,

నీలో నా ఉడుకుతనముంది

నీలో నువ్వు చూపిస్తున్న జీవితాలను అన్వయించే నా సున్నితత్వం ఉంది

,

నీలో నా ఆనందముంది ,

నీలో నా ఆవేశముంది,

నీలో నా ఆక్రందన ఉంది , నీలో నా ప్రాణం ఉంది ,



నీలో గడిపిన క్షణాలు మళ్ళీ రావాలనుంది ,

గతమే తీపిగా మిగిలి పోకూడదని ఉంది ,

పద్మశ్రీ , మరొక్కసారి నీ ఒడిలో ఒదగాలనుంది..

Wednesday, March 23, 2011

నేనంటే ఇష్టం లేకుంటే ఇంత రాత్రి వేళ "ఒంటరిగా" నాకోసం ఎందుకు వస్తుంది ?.

అప్పటికే టైం తొమ్మిది దాటిపోయింది ..


నైమిషకి అన్నం తినిపించటానికి విఫలయత్నం చేసి, వదిన అన్నకి కాల్ చేసింది.
వాళ్ళ అమ్మ ఏంచేసినాసరే , వేణన్నలేనిది నిమ్మి నోట్లో ఒక్కముద్ద కూడా పెట్టించుకోదు.

ఇంటినుంచి కాల్ రాగానే నాతో సరే బాబు నేను వెళ్ళొస్తా , వీలుంటే భోజనం చేసాకా మిగిలిన ఇన్వాయిస్ లు ప్రింట్ తీసెయ్ అని ,గుడ్ నైట్ చెప్పి తను వెళ్లి పోయాడు ,

నేను గెస్ట్ హౌస్ కెళ్ళి భోజనం చేసి, కాసేపు టి.వి.చూసి, మా పి.యల్. తో మాటామంతీ పూర్తి చేసి తిరిగి "ఆఫీసుబాట" పట్టాను .


అర్దరాత్రి పన్నెండు కావస్తోంది. గెస్ట్ హౌస్ నుంచి మెల్లగా ఆఫీసు వైపు అడుగులు వేస్తున్నాను .


సీమ చింతకాయ చెట్టు చిన్న చిన్న ఆకుల మధ్యనుంచి ఎంతో నిండుగా , కొంచెం పెద్దగా , మొత్తానికి ముద్దుగా జాబిలి కనిపిస్తోంది . ఒక్కో అడుగు తనను చూస్తూ ముందుకు వేస్తున్న కొద్దీ , తను చెట్టు కొమ్మల ఆకుల మద్యన దాక్కుని నాతో దోబూచులాటాడుతోంది . జాబిలి వెన్నెల తెల్లదనానికి తోడు మా ఆఫీసు బయట గిన్నెపూల చెట్టు తన గుభాలింపుతో చాలా ఘాటుగా స్వాగతం పలికింది.

మెల్లగా ఆఫీసు గేటు తీసుకుని ఆఫీసులోకి వెళ్లాను .

పట్టపగలు కొత్తాపాతా, వాళ్ళూ వీళ్ళూ అని తేడా లేకుండా ఎవరు కనిపించినా అదేపనిగా మొరిగేసే మా వాచ్మెన్ వాళ్ళ కుక్క అసలు ఇప్పుడేమీ అలికిడే చెయ్యలేదు . గేటు తీసిన శబ్దానికి మా వాచ్మెన్ అయినా వస్తాడు కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ప్రింట్లు తీసేస్కుని వెళ్లి పోదాం అనుకున్నాను .
అతని జాడ కూడా లేదు .

మా ఊళ్ళో అర్ధరాతుల్లు ఎవరైనా అలికిడి చేస్తే, వీధి కుక్కలన్నీ ఒకేసారి మొరిగి రాత్రి పూట నిద్రను చెడగొట్టేసేవి. అప్పుడు వాటిపై పట్టలేనంత కోపం వచ్చేసేది . కానీ ఎప్పుడైనా ఇంట్లో ఒంటరిగా పడుకున్నప్పుడు మాత్రం అలా శబ్దం వినిపిస్తే ఇంకా మనుష్యులు తిరుగుతున్నారు అనే ధీమా ఉండేది .


ఇది ఏం ఊరో ఏమిటో కానీ, కనీసం వీధికి ఒక్క వీధికుక్క అయినా లేదు . ఈ ఒక్కటి చాలదూ ఈ ఊళ్ళో కనీస సౌకర్యాలు లేవని చెప్పటానికి .

ఆఫీసులోకి ఎంటరయ్యాను.నా లాప్ టాప్ లో ఏ.ఆర్ . రెహమాన్ సాంగ్స్ సన్నని సౌండు తో పెట్టుకుని, వరసపెట్టి " వర్క్ కంప్లీషన్ రిపోర్టు" లు , "ఇన్వాయిస్" లు ప్రింటులు కొడుతున్నాను . సమయం మాత్రం నిశ్శబ్దం గా గడిచిపోతోనే ఉంది .


" ఏ అజనభీ తూ భీ కభీ ఆవాజ్ దే కహీసే" ఈ సాంగు ప్లే లిస్టు లో ప్లే అవుతోంది . ఈ సాంగ్ ని ఎన్ని సార్లు వినుంటానో నాకే తెలీదు .వినీ వినీ ప్రతీ లైనూ కంఠతా వచ్చేసాయి . అంత ఇష్టం నాకు ఆ పాటంటే.
[అదేమిటి నీకు తెలుగే సరిగా రాదు , అలాంటిది హిందీ సాంగు ని అన్నిసార్లు ఎలా విన్నావ్ అంటారా ? నాకు హిందీ రాదు కాబట్టే అన్ని సార్లు విన్నాను . కాదు కాదు , హిందీ రాదు కాబట్టి ఇన్ని సార్లే విన్నాను . మీనింగు తెలుసుంటే ఇంకా చాలా సార్లే వినే వాడినేమో ?.]


మొత్తానికి దీక్షలో నిమఘ్నమైన మహర్షిలా నేను లాప్ టాప్ లో లీనమై పోయి ఇన్వాయిస్ లు ప్రింట్ తీస్తున్నాను.


అప్పటి వరకూ చుట్టుపక్కల పచ్చికనుంచి గుంపుగా వచ్చిన మిడతల శబ్దం కూడా మెలమెల్లగా తగ్గిపోయింది .


కొద్ది  సేపటి తర్వాత కాఫీ మెషిన్ మీట నొక్కి ఒక కప్పు కాఫీ చేతిలోకి తీసుకుని ఆఫీసు గుమ్మంలోనుంచి అందాల జాబిలిని చూస్తూ ఒక్కో సిప్పూ సిప్పుతున్నాను .

ఏం జాబిలి మాత్రమే ప్రకాశావంతమా ? మేము కాదా అన్నట్టు అప్పటివరకూ చీకటిగా ఉన్న మా ఆఫీసు గార్డెన్ లోంచి కొన్ని వందల మినుగుర్లు రెపరెపలాడుతూ శ్రావ్యమైన శబ్దం తో పైకి లేస్తున్నాయి. ఎంత అందం , ఎంత అందం , ఎంత సేపు చూసినా ఇంకా చూడాలి అనిపిస్తుంది .. రెప్ప మరల్చబుద్ది కావట్లేదు .

కాసేపటికి తమ విన్యాసాలన్నింటినీ చూపించేసాం అనుకున్నాయేమో మినుగుర్లు ఒక్కొక్కటీ గుడ్ నైట్ లు, టాటా లు  చెప్పుకుంటూ , నా వైపుగా వచ్చి నన్ను వెక్కిరిస్తూ, సెండాఫ్ చెప్పి వెళ్ళిపోయాయి .

మబ్బుల మాటున దోబోచులాడుతున్న జాబిలి. మా సౌధానికి పక్కగా దాక్కుంది. తనను చూడలేకున్నానన్న భావమేదో గిన్నెపూల మొహం లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది, అది కన్న మా గార్డెన్ దైన్యంగా తన వదనం పై చీకటి పొరను కప్పుకుంది.



ఈసమయం లో తను నాపక్కనుంటే ఎంత బావుండేదో కదా అనిపిస్తోంది.

నీ పక్కన ప్రస్తుతానికి లేని తన కోసం ఆలోచిస్తూ , ఇంత అందమైన క్షణాల్ని ఆస్వాదించలేకపోతున్నావేమో కదా , అని నా మనస్సు నన్ను ఎదురు ప్రశ్న వేస్తూ ఉంటే,నేను పొందిన ఆనందపు అనుభూతిని తనకూ పంచాలి అనుకుంటున్నాను , తనతో పంచుకోవాలి అనుకుంటున్నాను , దాంట్లో ఆస్వాదించలేకపోవటమేముంది అని నాకు నేనే సర్ది చెప్పుకున్నట్లుంది.


చేతిలో కప్పు ఖాళీ అయిపోయింది . డస్ట్ బిన్ లో కప్పు పడేసి ,వాష్ బేసిన్ వద్దకెళ్ళి మొహాన్ని చల్లటి నీళ్ళతో కడుక్కుని , మళ్ళీ వచ్చి నా పని దగ్గర కూర్చున్నాను .


చుట్టుపక్కల అందరి ఇళ్ళలో దీపాలు ఆర్పేసుకుని , అందరూ మత్తుగా నిద్రపోతున్నారు.

మా ఆఫీసు , గెస్ట్ హవుస్ ల మద్య ఉన్న రోడ్డు పై ఏమాత్రం అలికిడి లేదు.


తను వచ్చింది. వచ్చి నన్ను గమనిస్తోంది.ఎప్పట్నుంచి తను నన్ను గమనిస్తుందో నేను గమనించలేదు. కానీ మిణుగురులు మెరిసి పడుతున్నప్పుడు , నేను వాటిని చూస్తూ ఉంటే అప్పటి వరకూ గోముగా ఉన్న గిన్నెపూల చెట్టు ,తన ఘాటైన గుభాలింపుల సౌరభాల్ని ఒక్కసారిగా కావాలని వెదజల్లింది. అంటే తను ఆపాటికే ఆ చెట్టు చాటున దాక్కొని ఉండి నన్ను చూస్తోందన్నమాట .

ఇదే తనకి అదును గా అనిపించినట్లుంది.
ఒక్కో అడుగూ నా వెనకాలగా వేస్తూ ఆఫీసు లోకి వచ్చేసింది.


తను వచ్చిందన్న విషయం వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండానే నాకు తెలుస్తోంది.


ప్రింటర్ దగ్గరకి కొన్ని ప్రింట్స్ తెచ్చుకోవటానికి నేను అటువెళ్ళగానే , చడీచప్పుడు లేకుండా నా పక్కనే ఉన్న బీరువా దగ్గరకి వచ్చేసింది . నేను చూడలేదేమో అనుకుని , తమాషా చేద్దామని చూస్తుంది. సర్లే తన సంతోషాన్ని మనం కాదనటం ఎందుకులే అనుకుని , నేనూ చూడలేనట్టే ఉన్నాను.

తను వస్తూ, వస్తూ ఆచెట్టు దగ్గరనుంచి తెంపుకొచ్చిన పూలని ఒక్కొటిగా నా మీదికి విసురుతూ , నేను వచ్చాను అని సింబాలిక్ గా చెప్తోంది . తన ముఖారవిందాన్ని చూసి చిరునవ్వు నవ్వటం కాదు కదా, కనీసం తన వైపు తలెత్తి చూడటం కూడా చెయ్యలేదు . తనకి కోపం బాగా వచ్చినట్లుంది . వెంటనే ఓ చిన్న రాయి తీసుకుని నామీదికి విసిరింది . నేను మాత్రం ఉలుకూ పలుకూ లేకుండా అలానే కూర్చుని ఉన్నాను.

అరరే డైరెక్టు గా తనగురించి , మా గురించి , మా ఇద్దరి చిలిపి సందర్భాల గురించి చెప్పేస్తున్నాగానీ అసలు తను ఎవరో, ఎక్కడుంటుందో చెప్పలేదు కదా మీకు .

తను మేముండే ఇంటి పైన ఉంటుంది . మేము ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటే, తను ఆ పైన ఉన్న నాలుగు అంతస్తుల్లో ఎక్కడో ఉంటుంది. చాలా సార్లు తనని మెట్లమీద నేమెట్లెక్కుతూ చూసాను . మొదటి సారి చూసినప్పుడు అంత నోటీసు చెయ్యలేదు . కానీ తర్వాత , తర్వాత చాలా బావుంటుంది అని అనిపించింది. చాలా బాగా నవ్వుతుంది . అంతకంటే బాగా గెంతుతుంది . అదేమిటి నడుస్తుంది అనాలి గాని గెంతుతుంది అంటున్నావ్ ? నీకేమైనా లూజా అని అడక్కండి , తను కొంచెం అల్లరిది అని సింబాలిక్ గా చెప్పా అంతే . మా అపార్ట్మెంటు లోనో , బయట వేరే ఎక్కడో నేను తన గురించి విన్నదేంటంటే , తను హౌస్ డెకరేషన్ (ఇంటీరియల్) సూపర్ గా చేస్తుందట. నలుగురికీ సహాయం చేసే మెంటాలిటీ అట .



ఈ మద్య , మేము ఒకరిని ఒకరు చూసుకోవటమే బాగా తగ్గిపోయింది , ఆఫీసులో బాగా పని ఉండటంవల్ల , తను బయటకెళ్ళే టైం కి , ఇంటికొచ్చే టైంకి నేను తనను చూడటం మిస్ అవుతున్నాను .

నిన్న మద్యాహ్నం మళ్ళీ మెట్ల దగ్గరే తను కనిపించింది .
తనని చూడగానే నేను సన్నగా నవ్వాను..

అదే సిగ్నల్ అనుకునుంటుంది.
ఎప్పుడు నేను బయటకొస్తానా, ఏకాంతం లో కలుస్తానా అని ఎదరు చూసుంటుంది.
అర్ధరాత్రి వేళ తనకోసమే నేను ఆఫీసుకి ఒంటరిగా వెళ్లాను అనుకునుంటుంది.
అందుకోసమే ఇలా ఇప్పుడు వచ్చుంటుంది..


అసలు తనకు నేనంటే ఇష్టం లేకుంటే ఇంత రాత్రి వేళ నాకోసం ఎందుకు వస్తుంది ?.
ఆలోచిస్తూ ఉంటే తనకూ నేనంటే చాలా ఇష్టమేనేమో అనిపిస్తుంది.


"ఎవరూ చూడకుండా , ఎంతో కష్టపడి ,నీకోసం, అర్ధరాతిరేల ఒంటరిగా వస్తే బెట్టు చేస్తున్నావా ?
లెవెల్ పోతున్నావా ?,నా అంతట నేనేవచ్చానని అలుసా ?"అంటూ నాపై అరవటం మొదలెట్టింది.

కోపం లో తననెప్పుడూ నేను చూడలేదు. ఏమాటకామాట చెప్పు కోవాలి కానీ , కోపం లో కూడా తను చాలా అందం గా ఉంది .తన వైపు చూసి కొంటెగా ఒక నవ్వు నవ్వుదుల్లోకి తను సిగ్గుల మొగ్గయ్యింది. మెల్లగా నా మీద వాలిపోవటానికి చూస్తోంది.


" ఇద్దరి మధ్యా నిశ్శబ్ధాని చెరిపేస్తూ, దూరాన్ని తగ్గిస్తూ తను నా పైపుగా వస్తున్న క్షణాన ....
.
.

నా సెల్ మోగింది ..




" ఇంకా ఎంత టైం పడుతుందమ్మా ? , అర్జున్ సార్ కాల్ చేసారు,
 అయిపోయింది .. లాస్ట్ ఇన్వాయిస్ ప్రింట్ తీస్తున్నాను , వచ్చేస్తున్నా సార్ అన్నాను .



నను తను  చేరుకుందామనుకున్న ఆ క్షణాన నేను ఫోన్ అటెండ్ చేసినందుకనుకుంటా తన కళ్ళు నిప్పులు వర్షిస్తున్నాయి.గొంతు ఆర్ద్రం గా మారి పోయింది .. తనని ఇంతకు ముందెప్పుడూ ఇలా చూడలేదు. కొత్తగా ఉంది .. కాదు , కొత్తగా ప్రవర్తిస్తోంది.



"మీ వల్ల నాకున్నదాన్నంతా కోల్పోయాను. ఎంతో మంది దగ్గరవాళ్ళని ఎప్పటికీ చేరుకోలేనంత దూరం చేసుకున్నాను.

మీ చేతిలో ఉన్న యమదండాలనుంచి వెలువడే రేడియేషన్ పాశాలతో మా వాళ్ళనందరినీ మీరు పొట్టన పెట్టుకున్నారు.అయినా నీ చూపులో లాలత్యం చూసి నువ్వు అందర్లాంటివాడివి కాదనుకున్నాను, కనీసం నేను నీ ప్రక్కనున్నప్పుడైనా ఆ యమపాశం నుంచి దూరం గా ఉంటావు అనుకున్నాను , కానీ నువ్వు నా ఆశని అడియాశ చేసి , నా నమ్మకాన్ని ఒమ్ముచేసావ్ " అంటూ కోపంగా నను దాటి వెళ్లి పోయింది.

ఎంత పిలిచినా పలకనే లేదు , కనీసం తిరిగి చూడలేదు కూడా ..


నన్ను ప్రేమించిన తనకోసం నేనేమీ చెయ్యలేకపోయాను ,
కనీసం ఒకే ఒక్క కాల్ ని అటెండ్ చెయ్యకుండా ఉండటం కూడా .. !


అందుకే తను నన్ను విడిచి వెళ్ళిపోయింది.
నా తప్పేమిటో నాకు చెప్పి మరీ వెళ్ళిపోయింది.

మరి నేనూ తనని ఇష్ట పడ్డాగా,
నేను ఇష్ట పడ్డ తనకోసం నేనేమి చెయ్యాలి ?


తన ఆశని బతికించటం తప్ప నేనేమీ చెయ్యలేను ..
అవసరం లేని టైం లో ఫోన్ ని వాడకూడదనే తన కోరికని నేను తీరుస్తాను..


నా దగ్గరగా పిచ్చుకలే కాదు , ఏ పక్షులున్నా ,
మ్యాక్జిమం కాల్ ని అటెండ్ చెయ్యను .. వీలుంటే అవి నా దగ్గరున్నంతసేపూ ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేస్తాను ..


అప్పటికైనా తనకి నా మీద కోపం తగ్గుతుందేమో వేచి చూస్తాను.
తన మనసును తెలుసుకోవటానికి , తను తిరిగి రావటానికి ,తనకో ఉత్తరం రాస్తాను ..

"
డియర్ స్పారో,



నా తప్పుని నేను తెలుసుకున్నాను , సరిదిద్దుకోవటానికి కనీసమైనా ప్రయత్నిస్తున్నాను..
నీకు కనీసం ఇదైనా తెలిసి , నాపై నీకు కోపం పోవాలని , నిన్ను మళ్ళీ చూడాలని , నువ్వు మళ్ళీ రావాలని ,
నీకోసం వేయికళ్లతో ( సారీ , రెండుకళ్ళతో ) వేచి చూస్తూ ,



నీ కోసమే నా అన్వేషణ సాగిస్తూ,

నీకై ,

నీ భగ్న ప్రేమికుడు ( నవ్వు కోవద్దు).

-----------------------------------------------------------------------------------------------------



THANK YOU..

Tuesday, March 8, 2011

అనగనగా ఓ బస్తీ [ బాంద్రా ( ఈస్ట్ ) , గరీభ్ వాడ, ముంబై

Dt: 07-March-2011,
Day : Monday  Time: 8.30 PM

 
నిన్న రాత్రి  పదిన్నరకి కొల్హాపూర్ లో స్టార్ట్ అయిన బస్సు ఉదయం అయిదు గంటలకల్లా ముంబయి సిటీ దరిదాపుల్లోకి చేరుకుంది .
నేను దిగాల్సిన స్టాప్ ( దాదర్ ) వద్దుల్లోకి టైం ఆరు అయ్యింది. ఎప్పట్లాగే లాడ్జ్ లో ఫ్రెష్ అయ్యి కాసేపు పడుకున్నాను .
క్లైంట్ కి అందించాల్సిన పేపర్స్ ఫైలింగ్ చేసి పదిన్నర ఆప్రాంతం లో లాడ్జ్  నుంచి బయలుదేరాను. టాక్సీ ఒకదాన్ని పట్టుకుని బాంద్రా ఈస్ట్ లో ఉన్న క్లయింట్  ( M.S.E.D.C.L) ఆఫీసుకి వెల్దుల్లోకి, ట్రాఫిక్ బాగా రద్దీగా ఉండటం వల్ల పదకొండున్నర అయ్యింది.
లోపలి వెళ్లి పని ముగించుకుని వచ్చేసాను . గతం తో పోల్చుకుంటే చాలా త్వరగా , ప్రశాంతం గానే ఇన్వాయిస్ సబ్మిషన్ అయిపొయింది అని చెప్పుకోవాలి . అక్కడే కేంటీన్ లో భోజనం చేసి ఇక బయటకు వస్తుండగా నేను గమనించింది ఏంటి అంటే , సెక్యూరిటీ . సెక్యూరిటీ చాలా టైట్ గా ఉంది. బయట వరండాలో లెక్కకు మిక్కిలి గా పోలీసులున్నారు.
ఎప్పుడూ లేనిది ఇంతమంది పోలీసులని ఎందుకు పెట్టారో నాకు అర్దంకాలేదు. బయటకు వచ్చిచూస్తే కోర్టు దగ్గర కూడా చాలామంది పోలీసులున్నారు. ఏదో బెదిరింపు కాల్ వచ్చి ఉంటుంది అనుకుని రైల్వే స్టేషన్ వైపు అడుగులు వేసాను.
దారిలో ONGC హెడ్ఆఫీసుకైతే అడుగుకో పోలీసు చొప్పున కాపలా కాస్తున్నాడు. మెల్లగా పోలీసు వ్యాన్ లను ఒక్కోదాని దాటుకుంటూ రైల్వే ఫ్లయ్ ఓవర్ బ్రిడ్జ్ ని సమీపించాను  .
బ్రిడ్జ్  మెట్లదగ్గర  భారీ  కేడ్లను   అమర్చి అడ్డంగా పోలీసులు నిలబడి దారిని నిరోదిస్తున్నారు. ఎప్పుడూ వాహనాలతో  రద్దీగా  ఉండే రోడ్డు  కేవలం పాద చారులకి మాత్రమె పరిమితమయ్యింది . అసలు ఏమయ్యిందో అర్ధం కాని అయోమయ పరిస్థితి లో ఉన్న నాకు , "FIRE RELIEF CAMP " అని ఒక బోర్డు కనిపించింది . బట్టలు , గోధుమలు , బిస్కట్లు పాలు , ఇలా చాలా రకాల పదార్ధాలతో అలాంటి కేంప్ లు చాలానే కనిపించాయి .
ఇంకో  నాలుగు అడుగులు వేద్దుల్లోకి విషయం అర్ధమయ్యింది . ఎప్పుడూ సందడిగా కలకలలాడుతూ  ఉండే  ఒక కాలనీ( బస్తీ )  అగ్నికి ఆహుతయ్యి బూడిద  గా మారిపోయింది  .



నివురయిపోయిన గుడిసేల్ని  చూస్తూ మరో  రెండు అడుగులు ముందుకేసాను . అగ్ని బాధితుల సహాయార్ధం అని తెచ్చిన బట్టల్ని రోడ్డుపై గుట్టలు గుట్టలుగా పోగేసారు . 
ఒక్కో బట్టల గుట్ట దగ్గరా లైన్లో నిలబడి ఎవరికీ సరిపోయే సైజు  బట్టల్ని వాళ్ళు ఏరుకుని తీస్కెల్తున్నారు. ముంబయి మెట్రో వాటర్ టేంకర్లకు అమర్చిన తాత్కాలిక కుళాయిల దగ్గర దోసిళ్ళతో పిల్లలు దాహాన్ని తీర్చుకుంటున్నారు. రోడ్డుపై ఒక ముసలవ్వ గుండె పగిలేంతగా ఏడుస్తోంది  అంత దగ్గరగా హృదయ విషాదక సంఘటనలని చూడటం ఇదే తొలిసారి కాదు . కానీ ఈ క్షణం నా కాళ్ళు ముందుకు కదలట్లేదు. చాలా సేపు చుట్టూ చూస్తూ అక్కడే నిలబడిపోయాను .

ఎప్పుడు జరిగింది ? ఇలా అడగొచ్చో లేదో నాకు తెలీదు , కానీ అక్కడున్న ఫైర్ మెన్ ని అడిగాను .
శుక్రవారం నైట్ జరిగింది .

తర్వాత ఎం అడగాలో తెలియలేదు .

ఎక్కడినుంచి వచ్చావ్ ? అతను అడిగాడు

కొల్హాపూర్ .

ఇక్కడికి ఎందుకొచ్చావ్ ?
రైల్వేస్టేషన్  లోపలి కి వెళ్ళటానికి


 "లైన్ క్రాసింగ్ బ్రిడ్జ్ కూడా మంటల్లో బాగా కాలి పోయింది .
ఇటువైపు నుంచి లోపలి వెళ్ళటానికి దారిలేదు.

అలా ట్రాక్ దాటుకుని వెళ్ళు అని కొదరు వెళ్తున్న దారిని  చూపించాడు అతను .

  
మసిబారిన బట్టలతో ఒక బాబు ( అయిదారేళ్ళు ఉంటాయి )  నా వెనుకనుంచి మంచి నీళ్ళ బాటిల్ తో  పరిగెత్తుకెళ్ళి  . ఒకామెకు అందించాడు.
రెండ్రోజులుగా ఏడుస్తూనే ఉందనుకుంటా , మొహం మొత్తం ఉబ్బి పోయి ఉంది . నీరసం గా ఏదో లోకం లో ఆలోచిస్తున్నట్లుంది.
ఏడ్చీ ఏడ్చీ ఒంట్లో సత్తువంతా కన్నీలలా కరిగి ,కనులెంట జారిపోయినట్లుంది .
ఆమె మంచి నీటిని తాగగానే, ఈలోకం లోకి వచ్చినదానిమల్లె ,ఆ అబ్బాయిని గుండెలకు హత్తుకుని , రఫీక్ , రఫీక్ అంటూ ఏడవసాగింది. వేరొకామె వచ్చి ఆమెను ఓదార్చటానికి విఫలయత్నం చేస్తోంది.

ఎదురుగా సగం కాలిన ఇంట్లోంచి , కాలిపోయిన బట్టల్ని వస్తువుల్ని బయటకు తీస్తున్న ఓ వృద్దుడు.
ఏం మిగిలుంది ? అని దీనంగా చూసే కుటుంబాలు , సహాయ కేంద్రాలు పంచిన పులిహోర(?) పొట్లాలు , కట్టు బట్టలే మిగిలాయి దేవుడో అంటూ రోదిస్తున్న మహిళల్ని ఎప్పటికప్పుడు కెమెరాల్లో బంధించే మీడియా ,వీరిమద్యనుంచి  నడుస్తూనేను .

ఎన్ని సార్లు ఎంతమంది సర్వే  సర్వే అంటూ వస్తారు అంటూ ఒకకంట ఆక్రోశిస్తూ , మరోకంట దయచేసి మాకు న్యాయం చెయ్యండి అంటూ వచ్చిన అధికారి కాళ్ళమీద పది బతిమాలుతున్న ఒకామెను చూస్తుంటే  చేతులు చెంపల్ని తాకక మానలేదు .



ప్రాంతీయ పత్రికల కధనాల ప్రకారం :


Young India , Young Paper అని స్లోగన్ పెట్టుకున్న ఒక పత్రిక " NBT ( నవ భారత్ టైమ్స్ ) "
In Sunday Edition :

ప్రమాదం  జరిగి ఒక రోజు గడుస్తున్నా ప్రభుత్వం బాదితులగురించి ఏమీ పట్టించుకోవట్లేదు.  నేషనల్ మీడియా బ్రేకింగ్ న్యూస్ లుగా స్క్రోల్లింగులు రం చెయ్యటానికి తప్ప , ప్రభుత్వం పై ఏ విధమైన ఒత్తిడీ తేలేక పోయింది. బాధితులు సమీప రైల్వే స్టేషన్ ని, సమీప ఫ్లయ్ ఓవర్ బ్రిడ్జిని  తమ ఆవాసాలుగా మార్చుకున్నారు .  
అగిని కీలలు బాగా ఎగసిపడటం తో రెండు ఫ్లాట్ ఫారం ల మద్య బ్రిడ్జి పూర్తిగా కాలి పోయింది .సుమారు  రెండువేల మంది పైగా నిరాశ్రితులయ్యారు . అగ్నిమాపక సిబ్బందితో కలిసి మొత్తానికి ఇరవై అయిదు మంది  క్షతగాత్రులయ్యారు . టెన్త్ , ఇంటర్  పరీక్షలు రాయాల్సిన విద్యార్ధులు  , హాల్ టికెట్ లు కాలిపోవడం తో ఆవేదన చెందుతున్నారు . దీనిక్కూడా ప్రభుత్వం నుంచి ఏవిధమైన సమాధానమూ లేదు .
"కేవలం మౌనం మాత్రమె సమాధానం కాదని , సంఘటన పై పూర్తి స్తాయి దర్యాప్తు చెయ్యాలని , సంఘటనకి  కారణమయిన  వారిని కఠినం గా శిక్షించాలని , ఈ ప్రమాదానికి  కారణం కేవలం ప్రభుత్వమేనని   , బస్తీని  ఖాళీ  చేయించేందుకే  ప్రభుత్వం ఇళ్ళకు  నిప్పంటించింది   అనే వార్తల్లో  ఎంతవరకూ నిజం ఉందో తేటతెల్లం చెయ్యాల"ని పతిపక్షాలు డిమాండు  చేసాయి  .



మహారాష్ట్ర మణి బిందు  అని స్లోగన్ పెట్టుకున్న ఒక పత్రిక " లోక్  మత్ "
 In Sun Day Edition :


గత  శుక్రవారం  రాత్రి  వంట  గ్యాస్  పేలటం  వల్ల   జరిగిన  అగ్ని ప్రమాదం లో  సుమారు  రెండువేల మది  నిరాశ్రయులయ్యారు . ప్రమాదం జరిగినందుకు  చింతిస్తూ ముఖ్య మంత్రి పృధ్వీ రాజ్ చౌహాన్ , బాధిత కుటుంబాలకు ప్రఘాడ సానుభూతి ప్రకటించారు . సహాయ చర్యలు యుద్ద ప్రాతిపదికన జరపాలని అధికారులను ఆదేశించారు . ఈ ప్రమాదం లో నష్టపోయిన కుటుంబానికి అయిదు వేలు చొప్పున నష్ట పరిహారం సి.యం. రిలీఫ్ ఫండ్ నుంచి ప్రకటించారు . 
తర్వాత విద్యాశాఖా మంత్రి రాజేంద్ర దర్దా మాట్లాడుతూ ,
"గరీభ్ నగర్ " ప్రాంత విద్యార్డులందరికీ పాఠ్య పుస్తకాలు పునఃపంపిణీ చేయనున్నట్లు , పదవ తరగతి , ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్దుల పరీక్షలకోసం ప్రత్యేక పరీక్షా కేంద్రాలని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు . 
దాతల విశేష స్పందన , విద్యార్దుల , స్వచ్చంద సేవా కార్యకర్తల కృషి ప్రసంసనీయం అని , బాదితులకి ప్రభుత్వం అన్ని విధాలా సహాయ పడుతుంది అని పునరుద్గాటించారు  .


****************

నాకు ఈ రెండు పత్రికల ధోరణీ చూస్తుంటే మన రాష్ట్రానికి  చెందిన రెండు పత్రికలే కళ్ళముందు కనిపించాయి .


సోమవారం ప్రచురితమైన ఎడిషన్ల లో NBT వాస్తవాన్ని ప్రతిబింబించక పోగా , లోక్ మత మాత్రం పరిస్థితి తీవ్రతను  పలచన చేస్తూ , ప్రభుత్వానికి బాసట గా నిలిచింది.

నిజ పరిస్థితిని వీక్షించి , రెండు పేపర్లను పక్క పక్కనే పెట్టి రీసెర్చ్  చేస్తే గాని నిజా నిజాలు అర్ధం కాక పోతుంటే , వాస్తవాలు ప్రజలకెలా తెలుస్తాయి ?  

 వాస్తవం లోకొస్తే ..

జామా మసీదు , నేషనల్ లైబ్రరీ లకు ఇక్కడినుంచి వెళ్లేవారి రద్దీ విపరీతం గా ఉంటుంది .
MMTS అభివృద్ది బాగా చెందటం తో ఇక్కడి MMTS  రైల్వే స్టేషన్ కి ప్రయానికుల తాకిడి వేలల్లోనే ఉంటుంది.
ఈ ప్రయాణికులపై ఆదారపడి చిన్నా చితకా పనులు చేసుకునే కూలీలు వేల సంఖ్యలో ఇక్కడి బస్తీల్లో నివసిస్తూ ఉంటారు .


బాంద్రా ఈస్ట్ రైల్వే స్టేషన్ పక్కనున్న స్లమ్ పేరు " గరీభ్ నగర్ ", " గరీభ్ వాడ "
 రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫారం మీద రకరకాల వస్తువులు అమ్మేవాళ్ళు , బయట సమోసా చాయ్ అమ్మేవాళ్ళు , ట్రాఫిక్ సిగ్నళ్ళ దగ్గర అడుక్కునేవాళ్ళు , రోడ్లు ఊడ్చేవాళ్ళు , ఎలక్షన్ల టైంలో డబ్బులు తీస్కుని సలాం కొట్టే కార్యకర్తలు, మట్టి పని , బండపని , మురుగుపని , కన్స్ట్రక్షన్ పని, సిమెంటు ఇసుకలు మోసే కూలి పని , టైలరింగు పని ,ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల పనులకి ఆ బస్తీ ( మురికివాడ , స్లం) నిలయం . సకల కళా పోషకురాలు బాంద్రా.

ఎన్నో వృత్తుల వారిని , ఎన్నో కులాలు , ఎన్నో జాతులు , ఎన్నో మతాల వారిని తనలో కలుపుకున్న బాంద్రా , ఎన్నో ఆటుపోతుల్ని కూడా ఎదుర్కుంది . నేతల రౌడీయిజానికి , వాళ్ళ రాజకీయ ప్రయోజనాలకోసమే  తరాలుమారినా
బాంద్రా తలరాత మారకపోవటానికి కారణం రాజకీయ పైశాచికత్వం .
దేశం లో దారిద్ర్యరేఖకు దిగువున ఉన్నవారి శాతం ఇంత తగ్గింది , అంత తగ్గింది ; మురుఇకి వాడలనేవే లేకుండా చేస్తాం పేదలకు పక్కా ఇల్లు కట్టిస్తాం అని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వాలు , అంటీ అంటకుండా వ్యవహరించటానికి కారణం కేవలం రాజకీయ లబ్దితప్ప మరేమీ లేదు .

రాజకీయ సంక్షోభం  ఏర్పడే   సమయాల్లో , ప్రభుత్వం పై ఏదైనా విషయంలో తిరుగుబాటు జరిగే సూచనలు ఉన్న సందర్భాలలో మన రాజకీయ నాయకులకి ఇవే పాశుపతాస్త్రాలనేవి
ప్రజలకి ( ముఖ్యం  గా ఆంద్రప్రదేశ్ పజలకి) తెలియనిది కాదు . లోగడ మన రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీకి , పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం , ఒక పేద వాడపై విరుచుకుపడ్డప్పుడు అదే పార్టీకి చెందిన పీ.జే.ఆర్. తనయుడు విష్ణు వర్ధన రెడ్డి , నాటకీయ ధర్నాలు , సినీ ఫక్కీ అరెస్టులు మనకి తెలియనివి కాదు.


గత మూడు నెలలుగా రాష్ట్రం ( మహా రాష్ట్ర ) లో మారిన ప్రభుత్వ సమీకరణలు , మంత్రివర్గ విస్తరణలు , అసమ్మతి వాదులు , ప్రభుత్వం పై సర్వత్రా వినిపిస్తున్న అవినీతి ఆరోపణలు , వీటినుంచి ప్రజల్ని మభ్యపెట్టటానికి , ప్రభుత్వం కదిపిన పావుగా కొన్ని మీడియా సంస్థలతో పాటు, కొందరు ప్రభుత్వ వ్యతిరేకుల నుంచి విరివిగా వినిపిస్తున్న మాట.
అయితే ప్రతీ ప్రమాదాన్ని ప్రభుత్వఖాతాలో జమ చెయ్యటం , ప్రమాదాల్ని రాజకీయం గా లబ్ది పొండుకోవటానికి ఉపయోదించటం కుటిల రాజకీయ ప్రమాణాలకి నిదర్శనమనేది , ప్రభుత్వ మద్దతు దారుల అభిప్రాయం .


భారత దేశానికి తొలి ఆస్కార్ అందించిన చిత్రం " స్లమ్ డాగ్ మిలియనీర్ " ఈ ప్రాంత నేపధ్యం లోనే జరుగుతుంది . ఆ చిత్రం లో నటించిన  బాలనటి రుబీనా ప్రస్తుతం ఈ అగ్ని  ప్రమాద భాదితురాలేకావటం విశేషం .       
     

సమయం మించి పోతుంది ..
తొమ్మిది గంటలకల్లా కొండుస్కర్ బస్సు స్టాప్ దగ్గర రిపోర్ట్ చెయ్యాలి .

ఈ సారి ముంబై ప్రయాణం చేదు అనుభవాన్ని మిగిల్చింది.

Friday, February 25, 2011

ఇవీ జ్ఞాపకాలే కదా !..

పది రోజుల సెలవు , ప .. ది.. రోజుల సెలవు ..

ఇన్ని రోజులు సెలవు, అదీ మా కంపెనీ వాళ్ళు ఇస్తారా? ఇవ్వరా అని డౌట్ గా ఉంది ..దాంతో లీవ్ పెట్టటానికే భయం గా ఉంది. ఇస్తే ఇస్తారు , లేకుంటే తర్వాత చూద్దాంలే అనుకుని సెలవు చీటీ ఓ పది రోజుల ముందుగానే తయారు చేసి , సరైన సమయం దొరగ్గానే మా వేణన్న మద్దతుతో మా అధిష్టానం టేబుల్ మీద ఉంచాను ..

మా బాసు , సెలవు చీటీని తీక్షణం గా అటూ ఇటూ తిప్పి చూస్తూ , ఎప్పటి నుంచి ఎప్పటి వరకూనో నొక్కి చదివి , లెక్కపెట్టి , ఒకటికి మూడుసార్లు ఒక్కానించి , ఇంకా పదిరోజుల టైం ఉందిగా , అప్పటికి పరిస్థితిని బట్టి చూద్దాంలే అని తీసుకెళ్ళి ఆయన పేపర్ రేక్ లో రెండో అరలో పడేసాడు.

ఇది మాకు ఎలాగూ మామూలే కాబట్టి , హమ్మయ్య ఒక పని అయి పోయింది అనుకుని , నెమ్మది గా బయటికి వచ్చేసాను ..మద్దతు ఇచ్చినందుకు గానూ వేణు అన్నతో ట్రైన్ టికెట్ కూడా రిజర్వేషన్ చేయించేసాను.

ఒకటి , రెండు , మూడు , ఇలా రోజులు లెక్కపెట్టుకుంటూ పోతే తొమ్మిదో రోజు రానే వచ్చింది .

ఆఫీస్ టైం అయిపోగానే , "సార్ మీ సంతకం .. నా సెలవు " అంటూ మా బాసు కేబిన్లోకి జెట్ స్పీడ్ తో దూసుకెల్లాను..

సెలవు ఇవ్వటం కుదరదు .. అని మా బాసు చెప్పాడు ..

టికెట్ రిజర్వేషన్ కూడా చేయించుకున్నాను .. అన్నాను నేను ..

ఐతే వెంటనే రిజర్వేషన్ కేన్సిల్ చేస్కో డబ్బులైనా మిగుల్తాయి అన్నాడు ఆయన ..

లోపలి వెళ్ళిన జెట్ కి తీవ్ర ప్రతిబందకం ఎదురవటం తో అక్కడే నిలబడిపోయి , బస్సున పొగలు చిమ్ముతూ నా మొహాన్ని నల్లగా తయారు చేసింది ..

మాడిపోయిన మొహం తో ఆఫీసు బయటకు వచ్చేసాను .



ఏమైందిరా ?.. అని అడిగాడు వేణన్న,   ..

ఇలా జరిగింది అన్నా , అని నా గోడు వెల్లడించాను అతనికి ..


"ఒకే అయితే , హ్యాపీ జర్నీ , ఇంటికెల్లాకా కాల్ చెయ్యి , అమ్మానాన్నలని అడిగానని చెప్పు " అని నవ్వుతూ ఇంటికి వెళ్ళిపోయాడు.


సామాను అంతా సర్దేసుకుని , గెస్ట్ హౌస్ లో మా సారు రూం లోకి వెళ్లి, సార్ ఒక పదివేలు కావాలి అన్నాను .
ఏం కొంటావ్ ? అడిగారు ఆయన .
ఇంకా డిసైడ్ కాలేదు , ఇంటికెల్లాకా ఆలోచించాలి అన్నాను ...

నా మాటల్లోని కుతంత్రాన్ని గమనించినవాడై ఆయన బస్సున లేచాడు ..
సెలవు లేదని చెప్పాగా , హెడ్ ఆఫీసు నుంచి మనవాళ్ళు వస్తున్నారు , వాళ్ళు ఇక్కడినుంచి తిరిగి వెళ్ళాక , నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు .

"గత నాల్గు నెలలు గా ఇదిగో వస్తున్నా , అదిగో వస్తున్నా అని చెప్పి , ఏదో ఒక సాకుతో ఇలానే ఇక్కడే ఉండి పోతున్నాను. ఇంటికి వెళ్ళలేక పోయానే అన్న బాధ తప్ప నాకు ఒరిగిందేమీ లేదు. ఇక్కడుండి  చేసిందేదైనా ఉందా అంటే అదీ లేదు . పండగకి కూడా ఇంటికి రాలేనంత బిజీగా ఉన్నావారా ? అని అడిగే మా వాళ్ళ ప్రశ్నలకి  సమాధానం చెప్పలేక పోతున్నాను, మీ మాట నిలబెట్టటం కోసం నాలుగు నెలలు గా నేను మాట పడుతూనే ఉన్నాను సార్ .. " అన్నాను ..

బొమ్మరిల్లు నేనూ చూసాన్రోయ్ అన్నాడు ఆయన ..


ఇప్పుడేంటి నన్ను ఊరు పంపుతారా, పంపరా ? అని అడిగాను ..

ఏంట్రా నువ్వు సొంత పెళ్ళాం పుట్టింటికి పంపు అని అడిగినట్లు అడుగుతున్నావ్  ?
డబ్బులు కావాలా ? సెలవు కావాలా అని ఆయన అడిగాడు .., ప్లాన్ ఫలించింది అన్న ఆనందం తో సెలవు అడిగాను ..
కాసేపు ఆగి , నా లేత మొహం లోకి (?) చూసి , మనస్సు కరిగినవాడై , అవ్విధం గా ఆయన నాకు సెలవు ఇచ్చేసాడు .


కొల్హాపూర్ నుంచి హుబ్లి బస్సులో,హుబ్లి నుంచి విజయవాడ రిజర్వేషన్ ఉంది కాబట్టి ట్రైన్ లో , అక్కడ నుంచి మా ఊరు బస్సులో ఇలా ప్రయాణ సాధనాలను సమర్ధవంతంగా ఉపయోగించుకుని మా ఊరు చేరనే చేరాను..

ట్రైన్ ప్రయాణం అంటే నాకు ఇష్టమూ కాదు , అలా అని అయిష్టమూ  కాదు  , అవసరం అంతే..
ఏమిటో తెలీదు కానీ నాకు ట్రైన్ ప్రయాణం  లో ఎక్కువ మంది పరిచయం అవుతారు. అలా ఫ్రెండ్స్ అయిన వాళ్ళూ ఉన్నారు.  అందుకని కొంచెం ట్రైన్ జర్నీ కి ఇంట్రెస్ట్ చూపిస్తుంటాను.


ఈ సారి ప్రయాణం లో మరిచిపోలేని సంఘటన ఏమిటంటే,

ఎక్కడికి వెళ్తున్నారో తెలీదు గానీ చాలా మంది టిబెటన్లు ట్రైన్ లో రెండు కంపార్ట్మెంట్ల నిండా ఉన్నారు. వాళ్ళ లో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. కషాయం బట్టలతో, బొచ్చు లేని తలలతో ( అదే గుండు లతో ) అటూ ఇటూ పరిగెడుతూ సందడి చేస్తున్నారు . అప్పుడప్పుడూ హిందీ తెలిసిన ఒకతను వచ్చి వాళ్లకు వాళ్ళ బాషలో ఏదోచెప్పి వెళ్తున్నాడు. ఇంతలో ఒక బెగ్గర్ ఒక అబ్బాయి వచ్చాడు. అందరితోపాటూ వాళ్ళని కూడా అడిగాడు, వాళ్ళలో ఒక అతను ఆ అబ్బాయిని ఉద్దేశించి ఏదో అన్నాడు. దానికి మిగతావాళ్ళు నవ్వుతున్నారు. వాళ్ళెందుకు నవ్వుతున్నారో అర్ధం కాక నాలాగానే ఆ అబ్బాయి కూడా తెల్లమొహం వేసి వాళ్ళనే చూస్తూ ఉండిపోయాడు . అది గమనించిన వేరొకతను ఆ అబ్బాయికి అర్ధమయ్యేలా చెప్పటానికి ట్రై చెయ్యటం మొదలు పెట్టాడు.

" ఐ , యు సేం ప్రొఫెషన్ " అంటూ అతనిచ్చిన ఎక్స్ప్రెషన్ కి అప్పటివరకూ కొద్ది పాటి ప్రశాంతం గా ఉన్న బోగీ మొత్తం నవ్వులతో నిండి పోయింది.

అయినా ఆ పిల్లాడికి అర్ధం కాక పోవటం చూసి, బాబూ వాళ్ళూ నీలాంటి వాళ్ళేనట , మనం మనం ఒకటే వృత్తికి చెందిన వాళ్ళం అని  అంటున్నారు అన్నాను. దాంతో వాడూ నవ్వుకుంటూ వెళ్లి పోయాడు ..

ఆ తర్వాత నుంచి ఆ రోజుని  తలచుకుంటే చిరునవ్వు మాత్రం గ్యారెంటీ అయిపోయింది నాకు..



కోనసీమ ముఖద్వారం .. రావులపాలెం






మా ఊరొచ్చేసాను.ఇక  నా శెలవల విషయానికొస్తే ..
మా ఊరి రామాలయం  ధ్వజస్థంభ ప్రతిష్ట, భీష్మ ఏకాదశి ఒకేసారి  రావటం  వాళ్ళ  మా ఫ్రెండ్స్  అంతా  గుడి దగ్గరే  కలిసారు.
గుడి దగ్గర  హోమం , ధ్వజస్థంభ పూజ , ధ్వజస్థంభానికి  బూరెలు వెయ్యటం  , భీష్మ ఏకాదశి  దైవసమారాధన,   తర్వాత   రోజు  అన్న సంతర్పణ , స్పెషల్  టూర్  అంతర్వేది  తీర్థం . 

ఇంకా  మా చెల్లి (హైమ)  వాళ్ళ  కొత్త  ఇంటికి  శంకు స్థాపన   , ఇక మద్యలో మా చెల్లి ( నిత్య చంద్రిక ) వాళ్ళ కాన్వెంట్ వార్షికోత్సవం _ _ _ _ __ హమ్మ  బాబోయ్  షెడ్యుల్  అయితే  అద్దరగొట్టి  వదిలిపెట్టింది.

నిజానికి పదిరోజులు అంటే బహుశా ఎక్కువ రోజులేనేమో .. కానీ పది రోజులు పట్టుమని పది నిమిషాల్లా కరిగి పోయాయి . ప్చ్ .. ఈ పది రోజులు  ఇంకో పది రోజుల వరకూ అవ్వకుండా  ఉంటే ఎంత బావుండేదో కదా ..


మా పాత రామాలయం ఉండే స్థానం లో ఈ మద్యనే  కొత్త రామాలయం నిర్మించారు. ఆలయ ,ధ్వజస్థంభ , పూజలు  శాంతి హోమాలు అన్నీ జరుగుతుండగానే నేను వేడుకకి హాజరయ్యానన్న తృప్తి చాలా ఉంది.  
ఇక నేను ఎప్పటికీ దాచుకోవాలి అనుకునే  కొన్ని మెమోరీస్ ..


ఈ బూరెలెయ్యటం మాట రాముడు చూస్కుంటాడు కానీ, మా ఊరి జనాలున్నారు చూడండి ,వామ్మో! అసలు అంత భక్తి  మా ఊర్లో ఉందని నాకే తెలీదు. ఫ్యామిలీ కొచ్చి 18 బూరెలు మాత్రమే వెయ్యాలి . ఎక్కవ వెయ్యకూడదు అని మా పూజారి గారు చెప్పారు . అయినా సప్లయ్ సామాన్ వాడి దగ్గర్నుంచి తెచ్చిన మూడు పెద్ద పెద్ద గంగాళాలు సరిపోలేదు. వీళ్ళ భక్తి విషయాన్ని పక్కన పెడితే దేవుడు నిజం గా ఉన్నాడు అని తెలిసింది మాత్రం ఆ బూరెల్ని బకెట్ల లో పోసి ధ్వజ స్థంభం పైకి పాస్ చేసేటప్పుడే ..        

బూరెలు ఇంకా ధ్వజస్థంభం పైకి పంపనే లేదు , కింద ఆడ వాళ్ళంతా చీరకొంగు పైకి చూపిస్తూ బూరెలో బూరెలు అని ధ్వజస్థంభం చుట్టూ పోగయి పోతే వాళ్ళ అతిభక్తికి (? తెలివి తక్కువతనం అంటారా ? , ఇక మీ మాటమీదే ఉందాం .) నవ్వాలో ఏం  చెయ్యాలో తోచలేదు .

పంతులుగారు శాస్త్రోక్తం గా మంత్రాలు చదువుతూ వెయ్యాలి లేవండర్రా, దారి వదలండి అంటూ అరిచినా , మైకు లో గీపెట్టినా ప్రయోజనం లేదు . అసలే ఆడాల్లాయే ఎక్కడ పట్టిన పాఠం వదులుతారు . "బూరెలో బూరెలు .." ఇదే వరస . మా పంతులు గారు డీలా పడిపోయి  ఏం చెయ్యాలో తోచక మా దగ్గరికి వచ్చాడు . బాబూ ముహూర్తం వేళ అవుతుంది నన్ను ధ్వజస్థంభం శిఖరాగ్రానికి చేరవేయండి అన్నాడు. ఆయన మాట్లాడింది తెలుగే అని తెలుసుకుని , తర్వాత తేరుకుని మా వాళ్ళు ఒక నిచ్చెన తెచ్చి గుడి మీదుగా వేసి ఆయన్ని కొద్దిగా కస్టపడి పైకి చేర్చారు.

ఇంతలో మా లక్ష్మణుడు వచ్చి "అన్నయ్యా , ఈ జనాల్ని చూడరా , వరద ప్రాంతం లో పులిహార పొట్లాలో,పులిహార పొట్లాలో అని అరిసినట్టు , గుడి ప్రాంగణం లో "బూరెలో బూరెలు" అంటున్నారో "అన్నాడు . వెంటనే వాడికి ఒక గొప్ప అవుడియా వచ్చినట్లు "గోవిందా" అని గట్టిగా అరిచాడు. వెంటనే మిగిలినవాళ్ళంతా గోవిందా అన్నారు .  మా వాడు  ఏమీ అరవక పోడుల్లోకి వేరొకడు గోవిందా అన్నాడు. మళ్ళీ గుంపు గోవిందా అంది. ఇంక వాడు ఆగ కుండా "గోవింద కొడుతూ , మిగలిన వాళ్ళతో గోవింద కొట్టిస్తూ ఉన్నాడు. మా వాడు ఇండియా కి ప్రపంచ కప్పు తెచ్చినట్టు ఫేస్ లో ఫీలింగ్ పెట్టాడు. ఇంతలో పంతులు గారు మంత్రాలతో పాటూ బూరెలు వెయ్యటం మొదలెట్టాడు. ఆడాళ్ళు పోటీ పడి మళ్ళీ ఏరుకోవటం మొదలెట్టారు. ధ్వజ స్థంభం మీదుగా బూరెల వాన మొదలయ్యింది . ఆడాళ్ళకి అత్యాశ ఎక్కువ అని ఎవరో అనగా విన్నాను . ఇప్పుడు చూస్తున్నాను . ఇంతలో అరడజను బూరెలతో మా హైమా వచ్చింది. అన్నయ్యా ఇవి పట్టుకో , ఇంకా పట్టుకొస్తాను అంది . ఓహో మందలో మనం కూడా ఉన్నామన్న మాట అన్నాను. అవునన్నట్టు నవ్వింది. ఇంట్లో ఆరుగురికీ ఆరూ సరిపోయాయిగా వెళ్ళు అన్నాను . లేదన్నయ్యా పెద్దమ్మా వాళ్ళ ఇంట్లోంచి ఎవరూ రాలేదు గా  వాళ్ళకో రెండు తెస్తాను అంది. తెచ్చిన అసలు పద్దెనిమిదికీ వడ్డీ కూడా పట్టుకెల్లేలా ఉన్నావ్ ? అని అంటూండగానే ధ్వజ స్థంభం మీదినుంచి బూరెల సమూహం నా మీద పడగా ఒక్కదాన్ని కేచ్ పట్టుకున్నాను. ఈ ఒక్క దాంతో ఎడ్జిస్టు అయిపో అని చెప్పుదుల్లోకి నా జేబులో పడిన రెండో బూరెని తీస్కుని థాంక్స్ అన్నోయ్ అని చెప్పి వెళ్లి పోయింది. జేబుకు పడ్డ నూనె మరకని చూస్తూ బాధపడే లోపు ఇంకో బూరొచ్చి నా నెత్తిమీద పడింది .

" బాబూ కమిటీ కుర్రోళ్ళు , అప్పుడే నీరసించి పోయారు , ఇంకా సగం బూరెలు మిగిలే ఉన్నాయ్" అని ఎవరో అరిచారు.
పైనుంచి ఖాళీ బకెట్లు పంపితే , తిరిగి పంపుతాం అని గట్టిగా అరిసాడు తాతయ్య పెదనాన్న. ఇంతలో మా భరతుడు వచ్చి అన్నయ్యా , తాతయ్య పెదనాన్నే కుర్రాడు అయితే మరి మనం ? వీడి ప్రశ్నకి అంతా నవ్వుతుంటే , మా తాతయ్య పెదనాన్న మావాడి చెవి పట్టుకుని "పిల్లల్రా !" అని సమాధానం చెప్పాడు. 

    
చిన్న పిల్లలు తొక్కిసలాటకు దూరం గా ఉండాలి కాబట్టి పక్కగా నిలబెతున్నప్పుడు ..  














అంతా సిద్ధం , బూరెలెయ్యటమే తరువాయి ..  

అనకొండ .. ఎక్కడ ? అనుకోవద్దు . అతని పేరే అనకొండ


























మా రామాలయం ..

ధ్వజస్థంభానికి బూరెలు వెయ్యాలిగా ఆ సెట్ అప్ ఇది .. 














మా రాముడు .. & ఫ్యామిలీ














మా ఊరి దేవుడు , అందాల రాముడు ..



రామ భక్త , హనుమాన్ ..
















అభయాంజనేయ స్వామి  
















 
ఆంజనేయ , లక్ష్మణ సమేత సీతారాముడు ; శ్రీదేవి భూదేవి సమేత మహా విష్ణువు   

రామాలయ ధ్వజస్థంభం










మా ఊళ్ళో , ఇవి సర్వసాధారణం .. సంఘం ( గ్రూప్ )



  

ఇలా మా గుడిని చూసి చాలా రోజులయ్యింది . పాత గుడిలోనే మా బాల్యం గడిచింది
భీష్మ ఏకాదశి ..



సన్మాన కార్యక్రమం







మానే బుజ్జి , రాము , తోట పండు  








యాళ్ల రామారావు , ఓదూరి వెంకన్న , యాళ్ల పెద ఆంజనేయులు 

    


మద్యలో మా శర్మ గారు ..

















ఓదూరి తాతయ్య, ఆకుల గణపతి , ఓదూరి శివ , మైగాపుల వెంకన్న , మానే చినబుజ్జి     

యాళ్ల రామారావు , ఆకుల నాగబాబు ( ఎర్ర చొక్కా )














చంద్రా రెడ్డి గారు ( మా చంద్రం మాస్టారు












ఆలయ ముఖ ద్వారం పై పంచముఖ ఆంజనేయ స్వామి






శ్రీ ఆంజనేయం , ప్రసన్నాంజనేయం




ఫోటో బై .. మణి కృష్ణ ..  


తేజ ( మా అక్క గారి అబ్బాయ్ ), వాడు నన్నాడిస్తాడో నేను వాడిని నేను ఆడిస్తానో తెలీదు గానీ మొత్తానికైతే ఆటాడుకుంటాం.    





మా కంబైండ్ క్లాసులు ఈ చేను గట్లమీదే జరిగేవి .. నిజంగానేనండి  బాబు .. 







సరదాగా అలా పిల్లలతో కాసేపు .. ( నిత్య , బాబి , తేజ, పవన్ , నేను )