Friday, December 17, 2010

నేను మరో బాపు..

నా మొదటి బొమ్మ

బొమ్మ ద చిత్రం , పిక్చర్ ది ఆర్ట్

ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది ,
నాకంటే సోమరి , పనిబద్ధకం గాడు పెపంచం లో ఎవడైనా ఉంటాడా అని .

మొన్న కొల్హాపూర్ లో (మా ఆఫీసు లో ) కరెంటు పోయింది . యు.పి.యస్ ఉన్నంత వరకూ సిస్టం పై పనిచేసిన మా వేణు అన్న(మా టీం లీడర్) ఎలాగూ కరెంటు రాదని నిర్ధారణ కు వచ్చి డాక్యుమెంట్స్ అన్నీ చక్కబెట్టుకునే పనిలో పడ్డాడు. నేనూ ఏదో ఒక సహాయం చేసి పెడదామని అనుకున్నా. సర్లే , ఆఫీస్ లో వన్ సైడ్ పేపర్లు చాలా ప్రింటర్ దగ్గరా, షెల్ఫ్ ల లోనూ పడి ఉన్నాయ్ గా   వాటిని చక్కబెట్టి రెండో సైడ్ వాడదాం లే అని అన్నింటినీ ఒక పేపర్ కవర్ లో పెడుతున్నాను. ఒక షెల్ఫ్ లో రెడ్ కలర్ పెన్ కూడా కనిపించింది . రాస్తుందా లేదా అని ఒక లైన్ గీసా . రాస్తుంది .అంటే ఇట్స్ వర్కింగ్ నే కదా అని ఇంకో గీత గీసాను . రెడ్ పెన్ ఎంత ఎర్రగా రాస్తుంది .ఇంత మంచి పెన్ను ని ఎవడు ఈ షెల్ఫ్ లో పడేసాడబ్బా ? అనుకుంటూ ఆ పేపర్ పై నా పేరు రాసా . వేణు అన్న పేరు, ఆఫీస్ లో అందరి పేర్లు , నాకు తెలిసినోల్లందరి పేర్లు రాస్తూ కూర్చున్నాను . వావ్ ఎంత బావున్నాయ్  వీళ్ళ పేర్లు. పేర్లయి పోయాయి .  ఇంక సున్నాలు చుట్టటం మొదలెట్టాను . అలా ఒక కార్టూన్ బొమ్మ వచ్చింది . (పిచ్చోడి చేతి లో రాయి ఉంటే ఎంత ప్రమాదమో , నా చేతిలో పెన్ను పేపర్ ఉంటే అంతే ప్రమాదమని అప్పుడే నాకు తెలిసొచ్చింది ). బొమ్మ గీయగలనని నాకు ధీమా వచ్చింది. ఏదో డాక్యుమెంట్ కోసం వెతుకుతున్న వేణు అన్న దగ్గరికెళ్ళి , అన్నోయ్ నేనో బొమ్మ వేశాను చూడు అని చూపిస్తే "బావుంది ( అలా అనక పోతే నేను ఫీల్ అవుతానని ) " అన్నాడు .

 మనకెలాగా బొమ్మలు ( బొమ్మ ) గీసిన అనుభవం అల్రెడి (ఇప్పుడే) వచ్చింది కాబట్టి ఓ మంచి బొమ్మ గీద్దాం అనుకున్నాను. అనుకున్నదే తడవుగా ఏం గీద్దామా అని ఆఫీస్ అంతా (గోడమీద కేలేన్డర్లూ, సెల్ ఫోన్ స్క్రీన్ సేవర్లూ AటుZ అన్నీ )  చూస్తే , ఒక వైట్ లాంగ్ నోట్ బుక్ పై నుంచి నన్నే చూస్తున్న ఒక అమ్మాయ్ కనిపించింది .

ఒకసారి ప్రాక్టీసు చేసి తర్వాత గీద్దామని పెన్సిల్ కోసం వెతికా, షెల్ఫ్ లో ఎక్కడా లేదు.   షాప్ కెళ్ళి పెన్సిల్ కొనుక్కొద్దామా అనుకున్నా, నాలో ఉన్న సోమరి గాడు లేచి, నీ బోడి ప్రాక్టీసు కి కొత్త పెన్సిలొకటా అని నన్ను అక్కడి నుంచి వెళ్ళకుండా ఓ సెటైర్ వేసాడు. ఏదీ లేనప్పుడు యాపిల్ జ్యూసే అమృతం తో సమానం . అందుకే నా చేతిలో ఉన్న రెడ్ పెన్నే నా ఆయుధం లా కనిపించింది . ప్రాక్టీసు బొమ్మ పర్లేదనిపించింది .
 
(రోజూ డైరీ ఓపెన్ చేసినప్పుడల్లా  ఈ బొమ్మ నన్నెప్పుడు పబ్లిష్ చేస్తావ్ అని అడుగుతుంది .నిజానికి ఓ బొమ్మ అందం గా గీసి పబ్లిష్ చేద్దాం అనుకున్నా . ముందే చెప్పగా నా అంత పనిబద్ధకం గాడు పెపంచం లో ఉండడని. ఒక పక్క నా బొమ్మ పోరు పడలేక , నా బద్దకాన్ని విడలేక ఇంక తప్పక పోస్ట్ చేస్తున్నాను .)

రెండో బొమ్మ ఇంతకంటే అందం గా ఉన్నా, నాకది రెండోదే .
ఈ రఫ్ బొమ్మ (మనిషి  బొమ్మ ) నా మొదటి బొమ్మగా నాకు  తెలియకుండానే నా మనసులో స్థానం సంపాదించేస్కుంది.

మొదటి చూపు ,మొదటి ప్రేమ ,మొదటి ముద్దు ,మొదటి సంతకం ,మొదటి ఉద్యోగం,మొదటి జీతం  .... ఇలా మనకు సంభందించిన ప్రతీ మొదటి పనికి మన మనసులో మొదటి స్థానం ఉంటుంది .

నేను మొదటసారి గీసిన నా మొదటి బొమ్మ కేవలం నా డైరీ పేజీల మధ్యలో గతం మిగిల్చిన తీయటి జ్ఞాపకం గా మాత్రమే మిగిలి పోవటం నాకిష్టం లేదు .

రాధిక గారి బ్లాగు చూసాకా ఏదైనా రాయాలి అనిపించింది .

నిన్న మొన్న లలో గీతిక గారి బ్లాగ్ చూసాకా , నా బొమ్మని కూడా నా బ్లాగ్ ప్రపంచానికి పరిచయం చెయ్యాలనిపించింది .

టైటిల్ కి వీడురాసిన రాతలకి గీసిన గీతలకి ఎక్కడైనా సంబంధం ఉందా ?
వెధవ బిల్దప్పూ వీడూను అనుకోవద్దు . అక్కడికే వస్తున్నా ..
ఈ బొమ్మ పట్టుకెళ్ళి మా వేణు అన్నకి చూపిస్తే "నీలో మరో బాపు కనిపిస్తున్నాడు బాబు " అన్నాడు .
నిజమేనంటారా ? :-)

5 comments:

  1. సామి శరణం చాల బాగుంది నీవు గీసిన బొమ్మ... నీలో చాల టాలెంట్ వుంది ..ఈ పుత్తడి బొమ్మ నిన్ను మెచ్చుకుంటుందిలే..చాల బాగ రాసావు స్వామి నాద:))

    ReplyDelete
  2. కళ్ళు వెలుగుతున్నట్లు ఉన్నాయి. బహుశా నిన్నే చూస్తుందేమో.

    ReplyDelete
  3. వేణు అన్నా, అశోక్ అన్నా థాంక్స్ ఫర్ యువర్ కామెంట్స్ ..

    ReplyDelete
  4. నమ్మ లేకపోతున్నాను !!!! ...మీరు పెన్ తో ..అదీ పెద్దగా ప్రాక్టీసు లేకుండా గీసిన బొమ్మ ఇది అంటే ....

    నిజమే అయితే (నమ్మక తప్పని నిజమైనా ) , మీరు వ్రాయడం తో పాటు ఇంకా చాలా బొమ్మలు పబ్లిష్ చెయ్యాల్సిందే .. బద్ధకం అని ముందే execuse లు పెట్టుకొన్న లాభం లేదు .... :)

    ReplyDelete
  5. మౌళి గారూ, సారీ అండి ,
    చాలా లేటు గా చూసానండి మీ కామెంటుని , ఏమీ అనుకోకండేం..

    మీ సపోర్ట్ కి చాలా చాలా థాంక్స్ ..

    ReplyDelete