Tuesday, December 14, 2010

"ఆరెంజ్" కేవలం కలర్ కాదు, కలర్ ఫుల్ ఎంటర్టైనర్ .. " ?

నిజానికి నేను ఆంధ్ర ప్రదేశ్ లో ఉండి ఉంటే మొదటి రోజే రివ్యూ రాసేవాడిని . మొన్నటి వరకూ ఎప్పుడు రివ్యూ రాద్దామా అనేకన్నా ఎప్పుడు సినిమా చూస్తానా అనేదే నాకు పెద్ద కోరికగా ఉండేది. ఇప్పుడు సినిమా చూడాలనే కోరిక తీరింది.


వచ్చినా రాకున్నా , రివ్యూ రాయాలనే ఉబలాటం కొద్దీ నేను రాస్తున్న మొదటి రివ్యూ ..

ప్రేమ ..

ఈ పదం పుట్టి ఎన్ని సవత్సరాలైందో తెలీదు కానీ ఎప్పటికీ కొత్తగానే ఉంటుంది. ఈ పదానికి అర్ధం చెప్పటానికి , ఆ భావానికి రూపం దిద్దటానికి ప్రయత్నిచని మనిషే ఉండడు. ప్రేమ ఎప్పటికీ కొత్త భావం, కొత్త అనుభవం. ఈ భావానికి నిర్వచనం చెప్పమని , అనుభవానికి అక్షర రూపం దాల్చమని ఒక కోటి మందిని అడిగితే కోటి కొత్త నిర్వచనాలు చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు.


" ప్రేమించిన అమ్మాయి ని ప్రేమిస్తున్నట్లు నటించటం మహా పాపం. ఇప్పటికైనా నీకు తెలిసింది ఒక నిజం చెప్పడం ఎంత కష్టమో . అందుకే కష్టమైనా నేను నిజాలే చెప్తాను ..

ఈ క్షణమే నాకు ఒకటి అర్ధమవుతుంది ,నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పటమే అబద్దం అనిపిస్తుంది. నేను ప్రేమిస్తున్నాను అనే కన్నా నన్నే ఎక్కువగా ప్రేమించమంటున్నాను అనిపిస్తుంది . ఒక అమ్మాయ్ ని ప్రేమించలేక పోవటానికి కారణమే నేను . కారణాలతో మిగిలిపోకూడదు నేను . "

ఇలాంటి డైలాగ్స్ తో ఆరెంజ్ చూడచక్కగా రూపుదిద్దుకుంది. అయితే ఇది ఎక్కువగా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అని చెప్పడం లో సందేహమే లేదు .

చెర్రీ సినిమాలంటే నాకిష్టం ..

నేను "చిరుత" చూడటానికి కారణం "చిరంజీవి". "మగధీర" చూడ్డానికి కారణం "రాజమౌళి ". ఈ రెండు సినిమాలు నేను చెర్రీ నుంచి ఏమీ ఎస్పెక్ట్ చెయ్యకుండా వెళ్ళాను. కాబట్టి సినిమాలు బాగా నచ్చాయి. నేను ఏ కారణాల వల్ల ఈ సినిమాలకి వెళ్ళానో ,వాటికంటే చెర్రీ నే నాకు ఈ రెండు సినిమాల్లో బాగా నచ్చాడు.

అయితే చెర్రీ నుంచి నేను ఏదో ఆశించి , చెర్రీ కోసమే చూసిన సినిమా "ఆరెంజ్".

చెర్రీ కోసమే చూసాను కాబట్టి ఈ సినిమా నాకు నచ్చింది.

చెర్రీ "వన్ మేన్ షో " లా ఆరంజ్ నాకు అనిపించింది. చెర్రీ యాక్టింగ్, డైలాగ్ డెలివరీ అంతా బావుంది. కొన్ని సీన్లలో చిరంజీవి ని మళ్ళీ స్క్రీన్ పై చూసిన ఫీలింగ్ కలిగింది.


కధ క్లారిటీ కొంచెం దెబ్బతింది. జెనీలియా , ఫస్ట్ ఆఫ్ లో ఎంత తలనొప్పి తెప్పించిందో , సెకండ్ ఆఫ్ లో అంత ఆకట్టుకుంది .లాస్ట్ సాంగ్ లో అనుకుంటా కొన్ని డాన్స్ స్టెప్స్ , చరణ్ కన్నా చాలా ఫాస్ట్ గా చేసింది.


ఇక కధ విషయానికొస్తే..

రామ్ ఒక రేంజ్ ఐడియాలజీ కల ఓ చలాకీ కుర్రాడు . సిడ్నీ లో అక్కా బావల దగ్గర ఉంటూ , తన ఇష్టాన్ని (పెయింటింగ్ ని ) హాబీ లా ( గ్రాఫిటీ ..గోడలమీద బొమ్మలెయ్యటం) మార్చేసుకుంటాడు.

ఇష్టాన్ని కూడా ప్రేమ గా చూపించాడు దర్శకుడు . చిన్న వయసులో స్కూల్ టీచర్ ని ఇష్టపడటాన్నికూడా ప్రేమే అన్నాడు. పదహారేళ్ళ వయస్సు లో క్లాస్ మేట్ , అలా,అలా మొత్తానికి 9 మందికి ప్రేమను పంచిన రామ్ ,నంబర్ టెన్ గా జాన్ (జెనీలియా ) కి కూడా ప్రేమను పంచెయ్యటానికి సిద్దపడతాడు.

ప్రేమ అంటే వయస్సులో ఉన్నయువతీ యువకులు తప్పక స్వీకరించాల్సిన భాద్యతగా జెనీలియా (జాన్ ) భావించిందనుకుంటా కాబోలు , తనకు నచ్చిన మూడు క్వాలిటీస్ ఉన్న ముగ్గుర్నుంచి ఒకరిని తన ప్రేమికుడి గా నిర్ణయించటానికి చీటీ లు వేస్తుంది .ఆ చీటీ తీసి ప్రేమికుడి గా చరణ్ స్థిరపడి పోతాడు .

నిజమైన ప్రేమ నాకు జీవితం మొత్తం కావాలి రామ్ అని అడిగిన జెనీలియా (జాన్ ) కి , రామ్ (చరణ్ ) " ప్రేమించమని అడుగు , ఎంతైనా ప్రేమిస్తా , ప్రపంచం లో ఎవరూ ప్రేమించనంత ప్రేమ గా ప్రేమిస్తా , అయితే ఇంత కాలం ప్రేమించు అని మాత్రం అడగొద్దు. ఎందుకంటే జీవితం మొత్తం ప్రేమ ఒకేలా ఉండదు జాన్ , అలా ఒకవేళ నేను చెప్పినా నమ్మొద్దు .ఎందుకంటే ప్రేమ అనేది టు హార్ట్స్ కాదు , టు బ్రైన్స్ .నీ బ్రెయిన్ ఒకలా ఆలోచిస్తే , నా బ్రెయిన్ వేరేలా ఆలోచిస్తుంది.నాకు క్రికెట్ అంటే ఇష్టం , నీకు గోల్ఫ్ అంటే ఇష్టం . నాకు గ్రాఫిటీ అంటే ఇష్టం , నీకు ఇష్టం లేదు . ఇవాళ నాకు నీలో నచ్చింది రేపు నచ్చక పోవచ్చు . అప్పుడు అబద్దాలతోనే మోసపోతూ బతకడం మనకొద్దు జాన్, లైఫ్ లాంగ్ లవ్ ఒకేలా ఉండదు . అలా ఉండాలనే నేను కోరుకుంటున్నాను. ఉంటుందని నమ్మి రావటానికి నేను రెడీ , లేనప్పుడు విడిపోవటానికి నువ్వు రెడీ గా ఉండాలి" అని చెప్పే సీన్ సినిమా లో ఒక హైలెట్.

క్లైమాక్స్ లో చెర్రీ , జెనీలియా ల మద్య సీన్స్ భలే సరదాగా కామెడీ గా అనిపించాయ్.
చరణ్ ,జెనీలియా , బ్రహ్మానందం మధ్య సన్నివేశాలు చాలా సైలెంట్ గా , చూడ ముచ్చటగా ఉన్నాయి.

పప్పీ " ఐ లవ్ ,లవ్ స్టోరీస్", " లేత లేత లవ్ స్టొరీ ", అంటూ పెట్టిన ఎక్ష్ప్రెషన్ చాలా ఫన్నీ గా ఉన్నాయి.


"బావ మంచే కోరుకుంటాడు బావ మరిది .." అంటూ చెర్రీ లాంటి బావమరిది ని క్రియేట్ చేసిన భాస్కర్ ఈ క్షణం చాలా బాగా నచ్చాడు. అందరి బావ మరుదులూ అలా ఉంటే చాలా బావుండు అనిపించింది నాకు .

"సమష్యకు పరిష్కారం విడిపోవటమే అయితే విడి పోవటానికి క్షణం చాలు . కోర్టు లు , లాయర్లు , విడదీయటానికి నాలాంటోల్లు వందమంది ఉంటారు.అదే సమష్యకి పరిష్కారం ప్రేమించటమే అయితే ఎలా ప్రేమించాలో చెప్పేందుకే ఎవరూ లేరు బావా.. " అంటూ అక్కా బావల్ని కలపడానికి తపన పడ్డ రామ్ కేరక్టర్ ఇక్కడ నాకు బాగా నచ్చింది.

"ప్రేమికులకి మనసులు ఒకటే కావచ్చు కాని తనువులు రెండు. ఇలా రెండు తనువులకు మెదడులు , ఆలోచనలు , పెర్సనల్ స్పేస్ అనీ రెండే . ఎంత ప్రేమికులైనా, ఆఖరికి భార్యా భార్తలైనా ఒకరి ఇష్టాల్ని ఒకరు గౌరవించాలి . ఒకరి తప్పుల్ని మరొకరు మన్నించగలగాలి . వాళ్ళకంటూ ఉన్న స్పేస్ లో కూడా మన ఇష్టాల్ని రుద్దేసే ప్రయత్నం చెయ్యకూడదు. ఒకవేళ మన ఇష్తమైన వాళ్ళకోసం మన ఇష్టాల్ని త్యాగం చెయ్యటం చేసినా అదీ తీపిగుర్తు గా మిగిలిపోతుంది, ప్రేమను మరింత ప్రేమగా మార్చేస్తుంది ," అని కొత్తగా దర్శకుడు చూపించాడు .

ఏది ఏమైనా ఒక కొత్త కధని, చిత్రీకరణ లో కొత్తదనాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిచటానికి సినిమాయూనిట్ చేసిన కృషి ఫలించలేదు.

"ప్రేమ సరిపోక పోతే మరికొంచెం ప్రేమించాలి, అదీ సరిపోక పోతే మరికొంత ప్రేమించాలి , అలా అలా సముద్రమంత ప్రేమ ను పంచాలి . సముద్రమంత ప్రేమని పొందాలనే అంతా కోరుకుంటారు . అది ఒకే సారి సాధ్యం కాదు , కొంత కొంత గా జీవితం అంచుల వరకూ ప్రేమిస్తూ ఉంటే నే అది సాధ్యం . "

[ సినిమా రిలీజ్ అయ్యి ఎన్ని రోజులైందో తెలీదు . బహుశా చాలా మంది సినిమా ని చూసేసే ఉంటారు. చాలా మంది రివ్యూలు రాసే ఉంటారు . కానీ రాద్దాం అని అనుకున్న తర్వాత రాయలేక పోయాననే ఫీలింగ్ నాలో ఉండకూడదు. అందుకే డేర్ చేసి ట్రూత్ రాసా. ఇది నా వరకు నాకు అనిపించింది , నా వ్యక్తిగత అభిప్రాయం ]

8 comments:

  1. అసలు ప్రేమకి కొలతలు ఏంటి పిచ్చి కాకపోతే? తనేమన్నా చక్కర చేబదులు కోసం వచ్చిందా ఇంకా కావాలంటే ఇవ్వటానికి. ఒకసారి హీరోయిన్ విషయాన్ని పరిశీలిస్తే తను వేసినట్లే ఆముగ్గురు కూడా చీటీలు వేస్తే పేర్లు మేచ్ కావటం సాధ్యమేనా?ఇక హీరోది మరోపిచ్చి. కొద్దికాలం మాత్రమే ప్రేమించగలను అంటే కోరిక తీరేంత వరకా?

    ReplyDelete
  2. keka.. review...
    బావుందండి.. మీ పోస్ట్.. :)

    ReplyDelete
  3. @వేణు అన్నా,
    @వేణూరాం గారు ,

    మీ స్పందన కి థాంక్స్ .
    ---------------

    " జీవితం మొత్తం ప్రేమ ఒకేలా ఉండక పోవచ్చు కాబట్టి, ఈ రోజు ఉన్న ఇష్టాయిష్టాలు, అభిప్రాయాలు రేపు కూడా ఉంటాయని ఖచ్చితం గా చెప్పలేము కాబట్టి , రేపు అపార్ధాలతో , ప్రేమిస్తున్నాం అని మోసపోతూ జీవితం నాశనం చేసుకునే కంటే విడిపోవటమే మంచిదనేది అతని అభిప్రాయం.జీవితాంతం ప్రేమ ఒకే లా వుండాలనే అతనూ కోరుకుంటున్నాడు .అయితే ప్రేమ కనుమరుగైన క్షణం విడి పోవటానికి సిద్దం గా ఉండమని ఆమె కు చెప్తున్నాడు . ఇక్కడ కొంత కాలం అంటే ప్రేమ ఉన్నంత కాలం. ప్రేమ ఉంటే జీవితం అంచులదాకా , ఎవ్వరూ ఇవ్వలేనంత , ఎవ్వరూ కొలవలేనత సముద్రం కంటే ఎక్కువ ప్రేమని ఇస్తానని అతడు అన్నాడు కానీ, ప్రేమ వున్నా మధ్యలో వదిలేసి వెళ్తానని , విడి పోతానని అతడెక్కడా కోరుకోలేదు. ఒకవేళ చిన్న కలహమే వచ్చి ప్రేమ చెడిన పక్షం లో, తన ప్రేమ సరి పోవట్లేదని ఇంకా ఎక్కువ గా ప్రేమించటానికి సిద్దపడుతున్నాడే కానీ, anna సందు దొరికింది కదా అని సైడ్ అవ్వటానికి చూడట్లేదు ..! "

    ReplyDelete
  4. @@@@"బావ మంచే కోరుకుంటాడు బావ మరిది .." అంటూ చెర్రీ లాంటి బావమరిది ని క్రియేట్ చేసిన భాస్కర్ ఈ క్షణం చాలా బాగా నచ్చాడు. అందరి బావ మరుదులూ అలా ఉంటే చాలా బావుండు అనిపించింది నాకు .@@@@

    Same Pinch :) (మా తమ్ముడు కి మా వారితో మాట్లాడే ఛాన్స్ అస్సలు ఇవ్వకూడదు ..హమ్మో )

    మీరు పెట్టిన పోటో లు మీ రివ్యూ లానే నిజం లా ఉన్నాయి :)

    @@@@చరణ్ ,జెనీలియా , బ్రహ్మానందం మధ్య సన్నివేశాలు చాలా సైలెంట్ గా , చూడ ముచ్చటగా ఉన్నాయి. @@@@

    ilaaa chalaa same pinch lu unnayi ...:(


    manchi cofee laanti review , thanks for sharing :)


    @@@ఏది ఏమైనా ఒక కొత్త కధని, చిత్రీకరణ లో కొత్తదనాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిచటానికి సినిమాయూనిట్ చేసిన కృషి ఫలించలేదు.@@@

    ఫలిస్తే మిగతా సినిమాలు క్యూ కట్టి ఫ్లాప్ అవుతాయి , మనకి నచ్చింది చాలు :)

    ReplyDelete
  5. మీరు కరెక్ట్ ..
    మనకు నచ్చితే చాలు . నాకు నచ్చింది . నాకు అర్దమైంది రాసా అంతే .., ఎవరేమనుకున్నా డోంట్ కేర్ .

    థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ Mouli గారు ..

    ReplyDelete
  6. nice andi chaala bagundi mee blog keep writing all the best

    ReplyDelete
  7. అశోక్ అన్నా ,
    థాంక్ యు ఫర్ యువర్ సపోర్ట్
    & WELCOME to my BLOG

    ReplyDelete
  8. ప్రేమకి పునాది నమ్మకం. కానీ ముందే అపనమ్మకంగా ఉంటే అది ఖచ్చితంగా ప్రేమ కానేకాదు. "ఒకవేళ చిన్న కలహమే వచ్చి ప్రేమ చెడిన పక్షం లో, తన ప్రేమ సరి పోవట్లేదని ఇంకా ఎక్కువ గా ప్రేమించటానికి సిద్దపడుతున్నాడు." కలహం వచ్చేది ప్రేమ సరిపోక కాదు. ప్రేమ వ్యక్తీకరణలో నిర్లక్ష్యం వలన లేదా అపార్థాల వలన.

    ReplyDelete