మా పాకశాల ( ప్రయోగశాల )..
( భారత దేశానికి స్వతంత్రం వచ్చింది అని నేను ఎక్కువ గా నమ్మేది నేను మా కిచెన్ లో ఉన్నప్పుడే )
ఆడవారు మగవారికి వంటల్లో ఏ మూల కూడా సరిరారని ,
పురాణాల్లో నలుడు , భీముడు, మా ఊళ్ళో వంటల నాగరాజు , మన బ్లాగుల్లో చుంబరస్కా మంచు గారు, ప్రస్తుతం నేను , ఇలా లెక్క పెట్టుకుంటూ పోతే పెపంచం లో వంటలు చేసే ఆడవాళ్ళతో పోలిస్తే, మేమే ఎక్కువ ఉంటాం. బాగా వండుతాం . అనీ మా ట్రైనీ స్టూడెంటుకి నేను చేసిన హితబోధ సారాంశం .
ఆరు అవ్వగానే కిచెన్ లో మా __మూక చొరబడింది.
మా కిచెన్ లో చెఫ్ కంటే ట్రైనీ చెఫ్ లకే స్వేచ్చ ఎక్కువ ..
చెఫ్ చెయ్యాలనుకున్న ఏ వంటకాన్నీ మా కిచెన్ లో తన ఇష్టానుసారం చెయ్యలేడు. ఎందుకంటే ఆ వంటకానికి మద్య మద్య లో జూనియర్ చెఫ్ ల ఇష్టాలూ , కొన్ని కొన్ని పదార్ధాలూ తోడవుతూ ఉంటాయి .
సింపుల్ గా చెప్పేదేంటంటే .. చెఫ్ చేద్దామనుకున్న వంటకానికీ , చివర వచ్చే వంటకానికీ అసలు పొంతనే ఉండదు ..
మా బాషలో చెప్పాలంటే మాది కిచెన్ కాదు .. ఓ ప్రయోగశాల ..
కొత్తకొత్త వంటలకు మేము ఇక్కడ ప్రాణం పోస్తాం , కొత్త కొత్త చెఫ్ లను తయారు చేస్తాం .. ,
ఆడవాళ్ళకంటే మగ వాళ్ళే అన్ని విషయాల్లో గ్రేటని,
వంట గురించి కనీసం అ,ఆ,ఇ,ఈ లు కూడా తెలియని మగవాడు ఎవడైనా ఉంది ఉంటే వాడు ఆడవాళ్ళు వండిన వంటను పొగడటం తప్ప వేరే ఏమీ చెయ్యలేడని మా గట్టి నమ్మకం ..
అందుకే మా గెస్ట్ హౌస్ లో ఉండే వాల్లందరికీ సంపూర్ణ వ్యాకరణ సహిత వంటలు నేర్పుతాం.
మా ప్రయోగశాల కొన్ని ప్రాధమిక సూత్రాలకి , కొన్ని నియమ నిబందనలకి కట్టుబడి పని చేస్తుంది ..
ప్రతీ ఒక్కరు చెయ్యాల్సిన ప్రతిజ్ఞ..
మా ప్రయోగశాలలో ప్ర్రయోగాలే కాదు , వైవా కూడా ఉంటుంది .
అప్పుడప్పుడూ నాలెడ్జ్ షేరింగ్ కోసం గ్రూప్ డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి .
(అంటే పిచ్చాపాటి కబుర్లు కాదు )
ఒకానొక డిస్కషన్ లో నాకు మా సీనియర్ చెఫ్ చెప్పిన సత్యం ఏందయ్యా అంటే ..

(ఈ మద్య కుక్కర్ ఉన్నవాడే కింగు అనే మంచన్న సూత్రాన్ని కూడా, మా ప్రాధమిక సూత్రాల జాబితాలో చొప్పించాం )
ఏదైనా పనిని సక్రమం గా చెయ్యాలంటే , ముందు ఆ పని పై ఉన్న అపోహలు పోవాలి . లెర్నర్లందరికీ డౌటులు, అపోహలు క్లియర్ చెయ్యటం కోసం సండే,సండే సీనియర్లచే స్పెషల్ క్లాసులు కూడా నిర్వహించ బడును
సండే క్లాసు లో మా ట్రైనీ ఒక అబ్బాయి నన్ను అడిగిన ప్రశ్న ..
" ఆడ వాళ్ళు వండిన వంటలు చాలా బావుంటాయి కదా , ఏ వంట తిన్నా అమ్మ చేతి వంట రుచి రాదు కదా ! , మరెప్పటికీ వాళ్ళను మించి మనం వంట రుచిగా చెయ్యలేమా ?"
వాడి అవివేకానికి ఫకాలున నవ్వాను ..
జూనియర్ల సందేహాలు నివృత్తి చెయ్యటం సీనియర్ల భాద్యత కాబట్టి ,వాడికి సమాధానం చెప్పటం మొదలెట్టాను ..
"జూనియర్ గా నీ ప్రశ్న మంచిదే ..
ఈ ప్రశ్న, నీ పరిపక్వత చెందని మెదడు కి నిదర్శనం ..
ఈ ప్రశ్న, నీ అవగాహనా రాహిత్యానికి నిదర్శనం ..
ఈ ప్రశ్న, నీకు ప్రపంచ జ్ఞానం అస్సలు లేదు అనేదానికి నిదర్శనం ..
ఈ ప్రశ్న, నీ .......
(అనవసరం గా వీడిని ప్రశ్న అడిగాను , బుర్రతినేస్తున్నాడు అన్నట్లు వాడు చూసినట్లు నాకు అనిపించింది )
సమాధానం చెప్పటం, నీ డౌటు క్లేరిఫై చెయ్యటం నీ సీనియర్ గా నా వృత్తి ధర్మం కాబట్టి చెప్తా , గుర్తుపెట్టుకో ,
"ఆడ వాళ్ళు వండిన వంటలు చాలా బావుంటాయి కదా !.. " అంటే,
కాదు.. ఆడ వాళ్ళు వండిన వంటలు ఎప్పుడూ బావుండవు.
(ఇక్కడ నా ఉద్దేశ్యం ఎప్పుడూ బావుండవు , అప్పుడప్పుడూ మాత్రమే బావుంటాయి అని )
"
" ఏ వంట తిన్నా అమ్మ చేతి వంట రుచి రాదు కదా ! " అంటే
రాదు .. నిజమే ఏ వంట తిన్నా అమ్మ చేతి రుచి రాదు .
అక్కడ గొప్పదనం వంటది కాదు . అమ్మది,అమ్మ చేతిది .
అమ్మ కూడా ఒక్కోసారి వంటను అటూ ఇటుగా చేస్తుంది . కానీ మనకెప్పుడూ "అమ్మ చేతి వంట అమృత తుల్యమే". ఎందుకంటే మనకు అమ్మమీద ఉన్న ప్రేమ,అది ఆమె చేసిన ఆర్డినరీ వంటకు కూడా ఎక్స్ట్రార్డినరీ టేస్టు ని తెచ్చిపెడుతుంది ..
ఇక్కడ నేను చెప్పొచ్చేదేంటంటే "అమ్మ చేతి వంట అమృత తుల్యం గా మారటానికి కారణం , వంట కాదు ..
ప్రేమ .. అమ్మ పై నీకున్న ప్రేమ ..
రేపట్నుంచీ నన్ను ప్రేమించు .. నా వంట కూడా నీకు అమృత తుల్యం గా మారుతుంది " అన్నాను .

- భారత దేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు .
- వంటలు తెలిసన మగవాళ్ళందరూ గొప్పవాళ్ళు , తెలివైన వాళ్ళు . మేధాశక్తి , సృజనాత్మకత మెండుగా ఉన్నవాళ్ళు .
- మనం వండిందే వంట, వచ్చిందే టేస్టు.
- ఆయుధాల వాడుకను ( కుక్కరు , మిక్సీ , గేస్, కత్తి .. మొదలైనవి ) పొదుపుగా , సమర్దవంతం గా వాడతాను .
- వంట ఏ స్తితి లో ఉన్నా ఆత్మ స్థైర్యాన్ని కొల్పోను.
- ఒక వేళ వంట చేజారే స్తితిలో ఉంటే , నా అసామాన్య ప్రతిభా పాటవాలను ఉపయోగించి నా ప్రయోగాల ద్వారా కొత్త వంటకానికి ప్రాణం పోస్తాను
మా ప్రయోగశాలలో ప్ర్రయోగాలే కాదు , వైవా కూడా ఉంటుంది .
అప్పుడప్పుడూ నాలెడ్జ్ షేరింగ్ కోసం గ్రూప్ డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి .
(అంటే పిచ్చాపాటి కబుర్లు కాదు )
ఒకానొక డిస్కషన్ లో నాకు మా సీనియర్ చెఫ్ చెప్పిన సత్యం ఏందయ్యా అంటే ..
- రెండూ ఉడికినవే అయితే వంటచేసేప్పుడు ఏ పదార్దాన్నైనా , ఏ పదార్ధం తోనైనా కలపవచ్చు.
- మిక్సీ పట్టుకున్నవాడే మహరాజు.. వంట అటూ ఇటు అయిన పక్షం లో మసాలాను మిక్సించి, వంటలపై దట్టించి , వారి చేత మసాల జిందాబాద్ అని చెప్పించవచ్చు.