Friday, October 29, 2010

నా ప్రేమ ..


ప్రేమ ..

అంటే ఏంటి ?

ఈ పదం
వింటే ఒకప్పుడు నా ఒళ్ళు జలధరించేది ,
అదే పదం వింటే మరోసారి నా నరాలు వుప్పొంగేవి,
అదే సమయంలో వెయ్యి వోల్టుల విద్యుత్తు నా నర నరాల్లో ప్రవహించేది ,

ఇప్పుడు
ప్రేమంటే భయమేస్తుంది ,
ప్రేమంటే జాలేస్తుంది .,
ప్రేమంటే బాధేస్తుంది ..

నా జీవితం లో ప్రేమ ఓ జ్ఞాపకం గా మిగిలి పోతోంది ,
బంధాలని పెకిలించిన పాశమై మిగిలి పోతోంది ,
గతానికి వర్తమానానికి మద్య ఓ వంతెనగా మాత్రమే మిగిలిపోతోంది


కలలా చెరిగి పోతోంది
కలతై నిదుర లేపుతోంది .
కవితగా నిలిచిపోతోంది ,

నా బతుకు పుటలో చెరిగిపోయిన అక్షరం గా మాత్రమే రూపు దాల్చుతోంది..
నాది అనుకున్న నాది నాక్కాకుండా పోతోంది,
నాకంటూ ఏమీ లేకుండా పోతోంది ,
నా నన్ను ఎందుకిలా చేసావని ప్రశ్నిస్తోంది ..

నా గుండె లోతుల్లో గరళాన్ని నింపి ,
కంటి కలుగుల్లోంచి కన్నీటిని కారిపిస్తోంది.

నీకు తెలుసా ,
నా కన్ను నిమిషానికి డెబ్భై రెండు సార్లు, కన్నీటి చుక్కల్ని కారుస్తోంది ,
ప్రతి హృదయ స్పందనకి ఓక్కో చుక్క చొప్పున కారుస్తోంది ,

కన్నీళ్లు మది లో బాధని కడిగేస్తాయని,
జారే కన్నీటి విలువ తేలికపడిన గుండెకు మాత్రమే తెలుస్తుందని ఎవరో అన్నారు.
కానీ నా కన్నీళ్లు మాత్రం కనికరం చూపించట్లేదు నా పైన .

పెను తుఫాను రేగిన నా గుండె చప్పుడు తో ఆటలాడుతున్నట్లు,
నా కన్నీటి కడలి అలల తరంగాలు , నడి నిశి లో కూడా నా చెక్కిలి పై వరదని సృష్టించేస్తున్నాయి ..

అమృతం అశ్రువై,
ప్రేమ పాశమై ,
బంధం భారమై,
నువ్వు దూరమై ,నేను శిలనైన ఈ క్షణం ..

నా గుండె నీరు వాడుతోంది,
నీరు వాడి గట్టిపడుతోంది ,
గట్టి పడి బీటలీడు తోంది,
బీటలీడి రక్తమోడుతోంది .

4 comments:

  1. హలో ఫ్రెండ్ నాకు మే కవిత చాల నచ్చింది.....మీరు కవిత రాసార & లేదా ఎలా మేకు నిజాం గానే జేరిగింద

    ReplyDelete
  2. Nelo premanu preminche premikudito patu kalam pattina kavi kuda andariki kanipistunnadu

    ReplyDelete
  3. @ నందీష్ గారు ,
    జరిగింది , కవితగా రాద్దామని ఓ చిన్న ప్రయత్నం చేసానండీ ..
    @ పవన్ ( D.R.F ) అన్నా,
    నీ మాటల్లో నాక్కూడా ఓ కవి కనిపిస్తున్నాడు.
    నాకు తెలుసు యు ఆర్ రియల్లీ టాలెన్టెడ్. నేనెప్పుడు నీ బ్లాగ్ లో నీ పోస్టింగ్స్ చూడొచ్చు ?

    ReplyDelete
  4. ప్రేయసి కోసం రాజ్యాలను కాదన్నా, వలచినవాడికోసం అయినవారినందరినీ కాదనుకున్నా అది తమ ప్రేమను గెలిపించుకోవడానికే తప్ప మరే స్వార్థమూ లేదని మౌనంగా రోధించే ప్రేమికుల హృదయాల్లో ప్రేమ నిరంతరం చిరంజీవై వర్థిల్లుతూనే ఉంది. కానీ ఎందుకో తెలియదుగానీ ప్రేమ ఎంతో గొప్పదని తెలిసినా దాని పేరు వింటేనే చాలామందికి ఒళ్లంతా జలదరిస్తుంది. దాన్ని నిలువునా చంపేయాలని ఈ భూమ్మీదే లేకుండా చేసేయాలన్నంతగా ఆవేశం పుట్టుకొస్తుంది.

    ReplyDelete