
కాలం కరిగి పోతుంది.,
నీ పై ప్రేమ పెరిగిపోతుంది ..
కరిగేకాలాన్నిఆపలేను.,
నీపై పెరిగే నా ప్రేమనూ అంతే ..
మృత్యువు ముందు ఎవర్ని
వరిస్తుందో తెలియదు.. నువులేని ఆ క్షణం ఊహించలేను ..
మరుజన్మంటూ ఉంటే.,
నీ తనువుపై పుట్టుమచ్చని కావాలని కోరుకుంటాను .,
నీ తోడుగా జన్మిస్తాను.,నీ నీడగా మరణిస్తాను ..