Friday, February 25, 2011

ఇవీ జ్ఞాపకాలే కదా !..

పది రోజుల సెలవు , ప .. ది.. రోజుల సెలవు ..

ఇన్ని రోజులు సెలవు, అదీ మా కంపెనీ వాళ్ళు ఇస్తారా? ఇవ్వరా అని డౌట్ గా ఉంది ..దాంతో లీవ్ పెట్టటానికే భయం గా ఉంది. ఇస్తే ఇస్తారు , లేకుంటే తర్వాత చూద్దాంలే అనుకుని సెలవు చీటీ ఓ పది రోజుల ముందుగానే తయారు చేసి , సరైన సమయం దొరగ్గానే మా వేణన్న మద్దతుతో మా అధిష్టానం టేబుల్ మీద ఉంచాను ..

మా బాసు , సెలవు చీటీని తీక్షణం గా అటూ ఇటూ తిప్పి చూస్తూ , ఎప్పటి నుంచి ఎప్పటి వరకూనో నొక్కి చదివి , లెక్కపెట్టి , ఒకటికి మూడుసార్లు ఒక్కానించి , ఇంకా పదిరోజుల టైం ఉందిగా , అప్పటికి పరిస్థితిని బట్టి చూద్దాంలే అని తీసుకెళ్ళి ఆయన పేపర్ రేక్ లో రెండో అరలో పడేసాడు.

ఇది మాకు ఎలాగూ మామూలే కాబట్టి , హమ్మయ్య ఒక పని అయి పోయింది అనుకుని , నెమ్మది గా బయటికి వచ్చేసాను ..మద్దతు ఇచ్చినందుకు గానూ వేణు అన్నతో ట్రైన్ టికెట్ కూడా రిజర్వేషన్ చేయించేసాను.

ఒకటి , రెండు , మూడు , ఇలా రోజులు లెక్కపెట్టుకుంటూ పోతే తొమ్మిదో రోజు రానే వచ్చింది .

ఆఫీస్ టైం అయిపోగానే , "సార్ మీ సంతకం .. నా సెలవు " అంటూ మా బాసు కేబిన్లోకి జెట్ స్పీడ్ తో దూసుకెల్లాను..

సెలవు ఇవ్వటం కుదరదు .. అని మా బాసు చెప్పాడు ..

టికెట్ రిజర్వేషన్ కూడా చేయించుకున్నాను .. అన్నాను నేను ..

ఐతే వెంటనే రిజర్వేషన్ కేన్సిల్ చేస్కో డబ్బులైనా మిగుల్తాయి అన్నాడు ఆయన ..

లోపలి వెళ్ళిన జెట్ కి తీవ్ర ప్రతిబందకం ఎదురవటం తో అక్కడే నిలబడిపోయి , బస్సున పొగలు చిమ్ముతూ నా మొహాన్ని నల్లగా తయారు చేసింది ..

మాడిపోయిన మొహం తో ఆఫీసు బయటకు వచ్చేసాను .



ఏమైందిరా ?.. అని అడిగాడు వేణన్న,   ..

ఇలా జరిగింది అన్నా , అని నా గోడు వెల్లడించాను అతనికి ..


"ఒకే అయితే , హ్యాపీ జర్నీ , ఇంటికెల్లాకా కాల్ చెయ్యి , అమ్మానాన్నలని అడిగానని చెప్పు " అని నవ్వుతూ ఇంటికి వెళ్ళిపోయాడు.


సామాను అంతా సర్దేసుకుని , గెస్ట్ హౌస్ లో మా సారు రూం లోకి వెళ్లి, సార్ ఒక పదివేలు కావాలి అన్నాను .
ఏం కొంటావ్ ? అడిగారు ఆయన .
ఇంకా డిసైడ్ కాలేదు , ఇంటికెల్లాకా ఆలోచించాలి అన్నాను ...

నా మాటల్లోని కుతంత్రాన్ని గమనించినవాడై ఆయన బస్సున లేచాడు ..
సెలవు లేదని చెప్పాగా , హెడ్ ఆఫీసు నుంచి మనవాళ్ళు వస్తున్నారు , వాళ్ళు ఇక్కడినుంచి తిరిగి వెళ్ళాక , నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు .

"గత నాల్గు నెలలు గా ఇదిగో వస్తున్నా , అదిగో వస్తున్నా అని చెప్పి , ఏదో ఒక సాకుతో ఇలానే ఇక్కడే ఉండి పోతున్నాను. ఇంటికి వెళ్ళలేక పోయానే అన్న బాధ తప్ప నాకు ఒరిగిందేమీ లేదు. ఇక్కడుండి  చేసిందేదైనా ఉందా అంటే అదీ లేదు . పండగకి కూడా ఇంటికి రాలేనంత బిజీగా ఉన్నావారా ? అని అడిగే మా వాళ్ళ ప్రశ్నలకి  సమాధానం చెప్పలేక పోతున్నాను, మీ మాట నిలబెట్టటం కోసం నాలుగు నెలలు గా నేను మాట పడుతూనే ఉన్నాను సార్ .. " అన్నాను ..

బొమ్మరిల్లు నేనూ చూసాన్రోయ్ అన్నాడు ఆయన ..


ఇప్పుడేంటి నన్ను ఊరు పంపుతారా, పంపరా ? అని అడిగాను ..

ఏంట్రా నువ్వు సొంత పెళ్ళాం పుట్టింటికి పంపు అని అడిగినట్లు అడుగుతున్నావ్  ?
డబ్బులు కావాలా ? సెలవు కావాలా అని ఆయన అడిగాడు .., ప్లాన్ ఫలించింది అన్న ఆనందం తో సెలవు అడిగాను ..
కాసేపు ఆగి , నా లేత మొహం లోకి (?) చూసి , మనస్సు కరిగినవాడై , అవ్విధం గా ఆయన నాకు సెలవు ఇచ్చేసాడు .


కొల్హాపూర్ నుంచి హుబ్లి బస్సులో,హుబ్లి నుంచి విజయవాడ రిజర్వేషన్ ఉంది కాబట్టి ట్రైన్ లో , అక్కడ నుంచి మా ఊరు బస్సులో ఇలా ప్రయాణ సాధనాలను సమర్ధవంతంగా ఉపయోగించుకుని మా ఊరు చేరనే చేరాను..

ట్రైన్ ప్రయాణం అంటే నాకు ఇష్టమూ కాదు , అలా అని అయిష్టమూ  కాదు  , అవసరం అంతే..
ఏమిటో తెలీదు కానీ నాకు ట్రైన్ ప్రయాణం  లో ఎక్కువ మంది పరిచయం అవుతారు. అలా ఫ్రెండ్స్ అయిన వాళ్ళూ ఉన్నారు.  అందుకని కొంచెం ట్రైన్ జర్నీ కి ఇంట్రెస్ట్ చూపిస్తుంటాను.


ఈ సారి ప్రయాణం లో మరిచిపోలేని సంఘటన ఏమిటంటే,

ఎక్కడికి వెళ్తున్నారో తెలీదు గానీ చాలా మంది టిబెటన్లు ట్రైన్ లో రెండు కంపార్ట్మెంట్ల నిండా ఉన్నారు. వాళ్ళ లో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. కషాయం బట్టలతో, బొచ్చు లేని తలలతో ( అదే గుండు లతో ) అటూ ఇటూ పరిగెడుతూ సందడి చేస్తున్నారు . అప్పుడప్పుడూ హిందీ తెలిసిన ఒకతను వచ్చి వాళ్లకు వాళ్ళ బాషలో ఏదోచెప్పి వెళ్తున్నాడు. ఇంతలో ఒక బెగ్గర్ ఒక అబ్బాయి వచ్చాడు. అందరితోపాటూ వాళ్ళని కూడా అడిగాడు, వాళ్ళలో ఒక అతను ఆ అబ్బాయిని ఉద్దేశించి ఏదో అన్నాడు. దానికి మిగతావాళ్ళు నవ్వుతున్నారు. వాళ్ళెందుకు నవ్వుతున్నారో అర్ధం కాక నాలాగానే ఆ అబ్బాయి కూడా తెల్లమొహం వేసి వాళ్ళనే చూస్తూ ఉండిపోయాడు . అది గమనించిన వేరొకతను ఆ అబ్బాయికి అర్ధమయ్యేలా చెప్పటానికి ట్రై చెయ్యటం మొదలు పెట్టాడు.

" ఐ , యు సేం ప్రొఫెషన్ " అంటూ అతనిచ్చిన ఎక్స్ప్రెషన్ కి అప్పటివరకూ కొద్ది పాటి ప్రశాంతం గా ఉన్న బోగీ మొత్తం నవ్వులతో నిండి పోయింది.

అయినా ఆ పిల్లాడికి అర్ధం కాక పోవటం చూసి, బాబూ వాళ్ళూ నీలాంటి వాళ్ళేనట , మనం మనం ఒకటే వృత్తికి చెందిన వాళ్ళం అని  అంటున్నారు అన్నాను. దాంతో వాడూ నవ్వుకుంటూ వెళ్లి పోయాడు ..

ఆ తర్వాత నుంచి ఆ రోజుని  తలచుకుంటే చిరునవ్వు మాత్రం గ్యారెంటీ అయిపోయింది నాకు..



కోనసీమ ముఖద్వారం .. రావులపాలెం






మా ఊరొచ్చేసాను.ఇక  నా శెలవల విషయానికొస్తే ..
మా ఊరి రామాలయం  ధ్వజస్థంభ ప్రతిష్ట, భీష్మ ఏకాదశి ఒకేసారి  రావటం  వాళ్ళ  మా ఫ్రెండ్స్  అంతా  గుడి దగ్గరే  కలిసారు.
గుడి దగ్గర  హోమం , ధ్వజస్థంభ పూజ , ధ్వజస్థంభానికి  బూరెలు వెయ్యటం  , భీష్మ ఏకాదశి  దైవసమారాధన,   తర్వాత   రోజు  అన్న సంతర్పణ , స్పెషల్  టూర్  అంతర్వేది  తీర్థం . 

ఇంకా  మా చెల్లి (హైమ)  వాళ్ళ  కొత్త  ఇంటికి  శంకు స్థాపన   , ఇక మద్యలో మా చెల్లి ( నిత్య చంద్రిక ) వాళ్ళ కాన్వెంట్ వార్షికోత్సవం _ _ _ _ __ హమ్మ  బాబోయ్  షెడ్యుల్  అయితే  అద్దరగొట్టి  వదిలిపెట్టింది.

నిజానికి పదిరోజులు అంటే బహుశా ఎక్కువ రోజులేనేమో .. కానీ పది రోజులు పట్టుమని పది నిమిషాల్లా కరిగి పోయాయి . ప్చ్ .. ఈ పది రోజులు  ఇంకో పది రోజుల వరకూ అవ్వకుండా  ఉంటే ఎంత బావుండేదో కదా ..


మా పాత రామాలయం ఉండే స్థానం లో ఈ మద్యనే  కొత్త రామాలయం నిర్మించారు. ఆలయ ,ధ్వజస్థంభ , పూజలు  శాంతి హోమాలు అన్నీ జరుగుతుండగానే నేను వేడుకకి హాజరయ్యానన్న తృప్తి చాలా ఉంది.  
ఇక నేను ఎప్పటికీ దాచుకోవాలి అనుకునే  కొన్ని మెమోరీస్ ..


ఈ బూరెలెయ్యటం మాట రాముడు చూస్కుంటాడు కానీ, మా ఊరి జనాలున్నారు చూడండి ,వామ్మో! అసలు అంత భక్తి  మా ఊర్లో ఉందని నాకే తెలీదు. ఫ్యామిలీ కొచ్చి 18 బూరెలు మాత్రమే వెయ్యాలి . ఎక్కవ వెయ్యకూడదు అని మా పూజారి గారు చెప్పారు . అయినా సప్లయ్ సామాన్ వాడి దగ్గర్నుంచి తెచ్చిన మూడు పెద్ద పెద్ద గంగాళాలు సరిపోలేదు. వీళ్ళ భక్తి విషయాన్ని పక్కన పెడితే దేవుడు నిజం గా ఉన్నాడు అని తెలిసింది మాత్రం ఆ బూరెల్ని బకెట్ల లో పోసి ధ్వజ స్థంభం పైకి పాస్ చేసేటప్పుడే ..        

బూరెలు ఇంకా ధ్వజస్థంభం పైకి పంపనే లేదు , కింద ఆడ వాళ్ళంతా చీరకొంగు పైకి చూపిస్తూ బూరెలో బూరెలు అని ధ్వజస్థంభం చుట్టూ పోగయి పోతే వాళ్ళ అతిభక్తికి (? తెలివి తక్కువతనం అంటారా ? , ఇక మీ మాటమీదే ఉందాం .) నవ్వాలో ఏం  చెయ్యాలో తోచలేదు .

పంతులుగారు శాస్త్రోక్తం గా మంత్రాలు చదువుతూ వెయ్యాలి లేవండర్రా, దారి వదలండి అంటూ అరిచినా , మైకు లో గీపెట్టినా ప్రయోజనం లేదు . అసలే ఆడాల్లాయే ఎక్కడ పట్టిన పాఠం వదులుతారు . "బూరెలో బూరెలు .." ఇదే వరస . మా పంతులు గారు డీలా పడిపోయి  ఏం చెయ్యాలో తోచక మా దగ్గరికి వచ్చాడు . బాబూ ముహూర్తం వేళ అవుతుంది నన్ను ధ్వజస్థంభం శిఖరాగ్రానికి చేరవేయండి అన్నాడు. ఆయన మాట్లాడింది తెలుగే అని తెలుసుకుని , తర్వాత తేరుకుని మా వాళ్ళు ఒక నిచ్చెన తెచ్చి గుడి మీదుగా వేసి ఆయన్ని కొద్దిగా కస్టపడి పైకి చేర్చారు.

ఇంతలో మా లక్ష్మణుడు వచ్చి "అన్నయ్యా , ఈ జనాల్ని చూడరా , వరద ప్రాంతం లో పులిహార పొట్లాలో,పులిహార పొట్లాలో అని అరిసినట్టు , గుడి ప్రాంగణం లో "బూరెలో బూరెలు" అంటున్నారో "అన్నాడు . వెంటనే వాడికి ఒక గొప్ప అవుడియా వచ్చినట్లు "గోవిందా" అని గట్టిగా అరిచాడు. వెంటనే మిగిలినవాళ్ళంతా గోవిందా అన్నారు .  మా వాడు  ఏమీ అరవక పోడుల్లోకి వేరొకడు గోవిందా అన్నాడు. మళ్ళీ గుంపు గోవిందా అంది. ఇంక వాడు ఆగ కుండా "గోవింద కొడుతూ , మిగలిన వాళ్ళతో గోవింద కొట్టిస్తూ ఉన్నాడు. మా వాడు ఇండియా కి ప్రపంచ కప్పు తెచ్చినట్టు ఫేస్ లో ఫీలింగ్ పెట్టాడు. ఇంతలో పంతులు గారు మంత్రాలతో పాటూ బూరెలు వెయ్యటం మొదలెట్టాడు. ఆడాళ్ళు పోటీ పడి మళ్ళీ ఏరుకోవటం మొదలెట్టారు. ధ్వజ స్థంభం మీదుగా బూరెల వాన మొదలయ్యింది . ఆడాళ్ళకి అత్యాశ ఎక్కువ అని ఎవరో అనగా విన్నాను . ఇప్పుడు చూస్తున్నాను . ఇంతలో అరడజను బూరెలతో మా హైమా వచ్చింది. అన్నయ్యా ఇవి పట్టుకో , ఇంకా పట్టుకొస్తాను అంది . ఓహో మందలో మనం కూడా ఉన్నామన్న మాట అన్నాను. అవునన్నట్టు నవ్వింది. ఇంట్లో ఆరుగురికీ ఆరూ సరిపోయాయిగా వెళ్ళు అన్నాను . లేదన్నయ్యా పెద్దమ్మా వాళ్ళ ఇంట్లోంచి ఎవరూ రాలేదు గా  వాళ్ళకో రెండు తెస్తాను అంది. తెచ్చిన అసలు పద్దెనిమిదికీ వడ్డీ కూడా పట్టుకెల్లేలా ఉన్నావ్ ? అని అంటూండగానే ధ్వజ స్థంభం మీదినుంచి బూరెల సమూహం నా మీద పడగా ఒక్కదాన్ని కేచ్ పట్టుకున్నాను. ఈ ఒక్క దాంతో ఎడ్జిస్టు అయిపో అని చెప్పుదుల్లోకి నా జేబులో పడిన రెండో బూరెని తీస్కుని థాంక్స్ అన్నోయ్ అని చెప్పి వెళ్లి పోయింది. జేబుకు పడ్డ నూనె మరకని చూస్తూ బాధపడే లోపు ఇంకో బూరొచ్చి నా నెత్తిమీద పడింది .

" బాబూ కమిటీ కుర్రోళ్ళు , అప్పుడే నీరసించి పోయారు , ఇంకా సగం బూరెలు మిగిలే ఉన్నాయ్" అని ఎవరో అరిచారు.
పైనుంచి ఖాళీ బకెట్లు పంపితే , తిరిగి పంపుతాం అని గట్టిగా అరిసాడు తాతయ్య పెదనాన్న. ఇంతలో మా భరతుడు వచ్చి అన్నయ్యా , తాతయ్య పెదనాన్నే కుర్రాడు అయితే మరి మనం ? వీడి ప్రశ్నకి అంతా నవ్వుతుంటే , మా తాతయ్య పెదనాన్న మావాడి చెవి పట్టుకుని "పిల్లల్రా !" అని సమాధానం చెప్పాడు. 

    
చిన్న పిల్లలు తొక్కిసలాటకు దూరం గా ఉండాలి కాబట్టి పక్కగా నిలబెతున్నప్పుడు ..  














అంతా సిద్ధం , బూరెలెయ్యటమే తరువాయి ..  

అనకొండ .. ఎక్కడ ? అనుకోవద్దు . అతని పేరే అనకొండ


























మా రామాలయం ..

ధ్వజస్థంభానికి బూరెలు వెయ్యాలిగా ఆ సెట్ అప్ ఇది .. 














మా రాముడు .. & ఫ్యామిలీ














మా ఊరి దేవుడు , అందాల రాముడు ..



రామ భక్త , హనుమాన్ ..
















అభయాంజనేయ స్వామి  
















 
ఆంజనేయ , లక్ష్మణ సమేత సీతారాముడు ; శ్రీదేవి భూదేవి సమేత మహా విష్ణువు   

రామాలయ ధ్వజస్థంభం










మా ఊళ్ళో , ఇవి సర్వసాధారణం .. సంఘం ( గ్రూప్ )



  

ఇలా మా గుడిని చూసి చాలా రోజులయ్యింది . పాత గుడిలోనే మా బాల్యం గడిచింది
భీష్మ ఏకాదశి ..



సన్మాన కార్యక్రమం







మానే బుజ్జి , రాము , తోట పండు  








యాళ్ల రామారావు , ఓదూరి వెంకన్న , యాళ్ల పెద ఆంజనేయులు 

    


మద్యలో మా శర్మ గారు ..

















ఓదూరి తాతయ్య, ఆకుల గణపతి , ఓదూరి శివ , మైగాపుల వెంకన్న , మానే చినబుజ్జి     

యాళ్ల రామారావు , ఆకుల నాగబాబు ( ఎర్ర చొక్కా )














చంద్రా రెడ్డి గారు ( మా చంద్రం మాస్టారు












ఆలయ ముఖ ద్వారం పై పంచముఖ ఆంజనేయ స్వామి






శ్రీ ఆంజనేయం , ప్రసన్నాంజనేయం




ఫోటో బై .. మణి కృష్ణ ..  


తేజ ( మా అక్క గారి అబ్బాయ్ ), వాడు నన్నాడిస్తాడో నేను వాడిని నేను ఆడిస్తానో తెలీదు గానీ మొత్తానికైతే ఆటాడుకుంటాం.    





మా కంబైండ్ క్లాసులు ఈ చేను గట్లమీదే జరిగేవి .. నిజంగానేనండి  బాబు .. 







సరదాగా అలా పిల్లలతో కాసేపు .. ( నిత్య , బాబి , తేజ, పవన్ , నేను ) 




   

10 comments:

  1. మీది రావులపాలేమా అండి?
    నాకు ఆ వూరు అంటే చాలా ఇష్టం....2009 మే,జూన్ నెలలు అక్కడే గడిపాను... వూరిచివర ఒక అరటి తోట మధ్యలో ఒక చిన్న ఇంట్లో వుండేవాళ్ళం..అక్కడే దగ్గరలో వున్న ప్రాసెస్సింగ్ ప్లాంట్ లో ట్రైనింగ్ కి వచ్చాం..

    ReplyDelete
  2. @ prabandhchowdary gaaru ,
    అవునండి . నేను రావులపాలెం లోకల్ ..

    అయితే మా ఊరు మీకు బాగా నచ్చింది అంటారు. మళ్ళీ అప్పటి మీ జ్ఞాపకాలు నేను గుర్తుకు తెచ్చాను కదా !..

    ధన్యవాదాలు మళ్ళీ దయచేయండి .. మా ఊరుకి .. నా బ్లాగుకి కూడా .. :))

    ReplyDelete
  3. స్వామి గారు మాది కూడ ఓ పల్లెటూరు అండి ....
    నేను రాసిన మొదటి టపా చదివితే అన్ని జ్ఞాపకాలు
    గుర్తుకొస్తాయీ.....

    ReplyDelete
  4. మీ మొదటి టపా చూసాను .. మొదట కామెంటుదామనుకున్నా కూడా ..
    అయితే ఆఫీస్ పని మీద బయటకెళ్ళి ఆ రోజు కుదరలేదు ..

    తర్వాత చాలా మంది వేసేసారు . , తర్వాత ఆ పోస్టుగురించి మర్చి పోయాను .. అలా మీకోసం రాసిన కామెంటు డ్రాఫ్ట్ లోనే ఉంది పోయింది .. :)
    ఈ మద్య చూస్తే చాలా పోస్టులు వేసేసారు మీరు ..
    ఒక్కనెలలో ఇన్ని పోస్టులు రాసిన మీ మీద చాలా అసూయ గా కూడా ఉందండోయ్ ..

    ఎలాగైతేనేం మంచి పోస్టులేకదా అని నన్ను నేను సముదాయించుకున్నా.
    మీ కదలు బావున్నాయి ..

    మద్యాహ్నం మీ నెమలి కద చదివాను .. అక్కడ నెమలి బొమ్మ మీరు గీసిందేనా అని నాకో సందేహం వచ్చింది .. చాలా బావుంది కూడా ..
    ఇలా చాలా మంచి మంచి పోస్టులు చాలా చాలా , కాదు కాదు , బోలెడు వెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ..

    ReplyDelete
  5. swami garu thanks andi opikachesukoni
    na tappalanni chadivinamduku...
    nenu vumdedi londonlo kabbatti peddaga pani vundadu anduke marenni
    tapaalu rayagaliganu...
    nenu rasina pratidi chaduvuttunnaru
    yedo mi andari chalavato....
    miru kuda yinka manchi postlu veyyalani korukuntu....

    ReplyDelete
  6. తప్పకుండా ట్రై చేస్తానండి..
    థాంక్స్ ఫర్ సప్పోర్ట్ .. & all the best..

    ReplyDelete
  7. నన్నూ పిలుస్తారా? నేనే వచ్చేయాలా?
    బాసుని అలా మస్కా కొట్టాలా! ఇప్పుడు తెలిసింది..!
    బాగుందండీ పోస్టు...ఫుటోలు కూడా.

    ReplyDelete
  8. ఎన్నెల గారూ మిమ్మల్ని కూడా పిలవాలా అండి . పిలిస్తే గానీ రారా ?
    థాంక్స్ అండి .. తప్పదు ..ఇంటికెల్లాలంటే ఆమాత్రం మస్కా కొట్టాలికదండీ ..

    ReplyDelete
  9. ఆయ్ మీది రావులపాలెమేనాండి. నేను పుట్టింది ఆ చుట్టుపక్కలేనండి. పొడగట్లపల్లి. నాకు మూడేళ్ళ వయసులో ఆ ఊరు వదిలేసి భీమవరం వచ్చేశాము. నాకు పెద్దగా పరిచయం లేదు. నాకు తెలిసి రెండు మాట్లు వెళ్లాము. నాపెళ్లైన వారం రోజులకి మా నాన్నగారు తీసుకెళ్లారు. మా తాత ముత్తాతలు నివసించిన స్థలం మా ఆవిడకి చూపించి కనీసం మీరైనా ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉండండి రిటైరు అయిన తరువాత అని చెప్పారు. రెండేళ్ల క్రితం మళ్ళీ వెళ్లాము ఆ స్థలం అమ్మేయడానికి. బాధేసింది. మా అగ్రజుడు ఏడ్చినంత పని చేశాడు. వెల్ ఋణం తీరిపోయింది.

    మీ టపా చూసిం తరువాత మళ్ళీ అంతా ఒకమాటు గుర్తు కొచ్చింది. థాంక్యూ.

    ReplyDelete
  10. సుబ్రహ్మణ్యం గారూ ,
    నేను ఎక్కువగా ఉండేది మీ పొడగట్ల పల్లి లోనే నండి. ఆయ్ .. నా ఫ్రెండ్స్ ఇద్దరు అక్కడే ఉంటారు.
    మా ఊరి మెరక పొలాలకి సరిహద్దు మీ ఊరు ..
    కోనసీమ క్రికెట్ టోర్నమెంట్ కి మీ ఊళ్ళో బౌలర్స్ బాగా ఫేమస్..

    మీ నాన్నగారి ఆశ నెరవేరాలని కోరుకుంటున్నాను, మీరు కాకపోతే మీ అగ్రజుడైనా నేరవేరుస్తాడు.
    గృహ ప్రవేశానికి నన్ను తప్పకుండా పిలవాలి .

    ReplyDelete